Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sachin Tendulkar: మహమ్మద్ సిరాజ్.. లోడెడ్ గన్‌లా చెలరేగుతాడు

Sachin Tendulkar Lauds Mohammed Siraj, says Every time I see him, he introduces something new
Mohammed Siraj A Loaded Missile | IND VS SA Series | Oneindia Telugu

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. సిరాజ్ చూసిన ప్రతీసారి ఏదో కొత్త దనం కనిపిస్తుందని కొనియాడాడు. అవసరమైనప్పుడుల్లా లోడెన్ గన్‌లా నిప్పులు చెరిగేందుకు ఈ హైదరాబాద్ పేసర్ సిద్దంగా ఉంటాడని తెలిపాడు. సిరాజ్ త్వరగా నేర్చుకునే వ్యక్తని, అనతి కాలంలో టీమిండియా ప్రధాన పేసర్‌గా ఎదిగాడని మెచ్చుకున్నాడు. తాజాగా బ్యాక్ స్టేజ్ విత్ బొరియా కార్యక్రమంలో మాట్లాడిన సచిన్.. సిరాజ్‌ను ఆకాశానికెత్తాడు.

'మహమ్మద్ సిరాజ్‌ బౌలింగ్‌ రనప్‌ అద్భుతంగా ఉంటుంది. మైదానంలో అతనెప్పుడూ ఉత్సాహంగా కనిపిస్తాడు. అతను బౌల్‌ చేసేది తొలి ఓవరా లేక అఖరిదా? అన్నది గుర్తించలేరు. సిరాజ్‌లో ని ఈ లక్షణాలు నాకు ఎంతో నచ్చుతాయి. గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఇదే తరహా యాటిట్యూడ్‌తో సత్తాచాటాడు. సిరాజ్‌లో వేగంగా నేర్చుకునే లక్షణం ఉంది. అరంగేట్ర టెస్ట్‌లోనే అనుభవజ్ఞుడిలా బౌల్ చేశాడు. సీనియర్ల సలహాలతో మరింత మెరుగయ్యాడు. సౌతాఫ్రికా పర్యటనలోనూ సిరాజ్ సత్తా చాటుతాడు.'అని సచిన్ కొనియాడాడు.

ఇక తనపై సచిన్ చేసిన కామెంట్స్‌కు సిరాజ్ కృతజ్ఞతలు తెలిపాడు. 'థాంక్యూ సచిన్‌ సర్‌. మీ నుంచి ఇలాంటి మాటలు రావడం నాకెంతో స్ఫూర్తిదాయకం. దేశం కోసం ఎప్పుడూ అత్యుత్తమంగా ఆడేందుకే ప్రయత్నిస్తాను. స్టే వెల్‌ సర్‌' అంటూ ట్వీట్‌ చేశాడు.

సౌతాఫ్రికాలోని బౌన్సీ పిచ్‌లపై బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదని సచిన్.. భారత బ్యాట్స్‌మన్‌ను హెచ్చరించాడు. పలు బ్యాటింగ్ టిప్స్ కూడా చెప్పాడు. 'సౌతాఫ్రికా గడ్డ‌పై ఆడేటప్పుడు ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్ చాలా ముఖ్యం. అలానే ఫస్ట్ 25 ఓవర్లు సహనంతో ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్‌ని ఎక్కువగా నమ్ముకోవాలి. ఇక బ్యాటింగ్ చేసేటప్పుడు.. ఫస్ట్ శరీరానికి దూరంగా చేతులు వెళ్లకుండా చూసుకోవాలి. ఒకవేళ మీ చేతులు శరీరానికి దూరంగా వెళ్తే? అప్పుడు మీరు క్రమంగా క్రీజులో బ్యాలెన్స్ కోల్పోతారు. నేను చెప్పినట్లు ఆడితే.. కొన్ని సందర్భాల్లో మీకు కొన్ని బంతులు మిస్ కావచ్చు. కానీ.. ప్రతి బ్యాట్స్‌మెన్‌కి కొన్ని బంతులు బీట్ అవుతాయనే విషయం గ్రహించాలి. బౌలర్లు ఉన్నదే అలా బీట్ చేసి.. వికెట్లు తీయడానికే కదా? అయితే.. మీరు శరీరానికి దూరంగా ఒకవేళ చేతులు పోనిస్తే మాత్రం.. బంతులు మీ బ్యాట్ ఎడ్జ్ తాకి వెనక్కి క్యాచ్‌గా వెళ్లిపోతాయి'' అని సచిన్ టెండూల్కర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, December 22, 2021, 20:27 [IST]
Other articles published on Dec 22, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+