For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తెలుగు స్టార్ హీరోకి సచిన్ పెద్ద అభిమాని.. అతనెవరో తెలుసా?

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. ప్రపంచ క్రికెట్‌ ముఖ చిత్రంగా ఎదిగిన సచిన్ గురించి తెలియని అభిమాని ఉండరు. శతృ దేశం పాకిస్థాన్‌లోనూ సచిన్ అంటే పడి చచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి సచిన్ టెండూల్కర్ కూడా తెలుగులో ఒక స్టార్ హీరోకు పెద్ద అభిమాని. అంతేకాదు.. అతనితో మంచి స్నేహం కూడా ఉంది. ఆ హీరో ఎవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి. అతనంటే సచిన్‌కు బాగా ఇష్టం. ఈ విషయాన్ని మాస్టర్ బ్లాస్టర్ బహిరంగంగా చెప్పుకున్నా.. పరోక్షంగా వెల్లడించాడు.

చిరంజీవితో స్నేహం కేవలం ఒక సాధారణ పరిచయం మాత్రమే కాకుండా.. ఇరు కుటుంబాల మధ్య కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. చిరంజీవి నివాసంలో జరిగిన కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలకు కూడా సచిన్ హాజరయ్యారు. అంతేకాకుండా చిరంజీవితో కలిసి సచిన్ వ్యాపారాలు కూడా చేశాడు.

Sachin Tendulkar Is A Big Fan Of Telugu Star Hero Do You Know Who Is He

ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో‌ని కేరళ బ్లాస్టర్స్ జట్టుకు సహ యజమానులుగా కొనసాగారు. చిరంజీవి, అక్కినేని నాగార్జున, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌లతో సచిన్ ఈ జట్టును కొనుగోలు చేశారు. 2018లో సచిన్ టెండూల్కర్ కేరళ బ్లాస్టర్స్ జట్టులో తనకున్న వాటాను విక్రయించాడు. దాంతో వారి వ్యాపార భాగస్వామ్యం ముగిసింది. చిరంజీవి బర్త్‌డే‌లకు సచిన్ విషెస్ చెబుతాడు.

చిరంజీవితో పాటు మహేష్ బాబు, రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ చిత్రాలను కూడా సచిన్ ప్రశంసించారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాను ఎక్స్‌ వేదికగా కొనియాడాడు. సినిమాలో విజువల్స్, డ్యాన్స్‌, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉందని, తనను ఆకట్టుకుందని ట్వీట్ చేశారు.బాహుబతి చిత్రాన్ని కూడా కొనియాడిన సచిన్.. రాజమౌళి ప్రతిభను ప్రశంసించాడు. సినిమాల గురించి చాలా తక్కువగా మాట్లాడే సచిన్.. ఇటీవల సోషల్ మీడియా వేదికగా అభిమానులతో జరిపిన చిట్ చాట్‌లో 3BHK అనే తెలుగు సినిమా బాగా నచ్చిందని చెప్పాడు. సమయం దొరికితే సినిమాలు చూస్తానని వెల్లడించాడు.

Sachin Tendulkar Is A Big Fan Of Telugu Star Hero Do You Know Who Is He

బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్‌లను సచిన్ ఇష్టపడుతారు. పలు సందర్భాల్లో.. అమితాబ్ బచ్చన్‌పై తనకున్న అభిమానాన్ని సచిన్ చాటుకున్నాడు. అమితాబ్ నటించిన 'పింక్' సినిమాను చూసి ఎంతగానో ప్రభావితమయ్యానని సచిన్ ప్రశంసించాడు.

ఆమిర్ ఖాన్ నటించిన త్రీ ఇడియట్స్', 'పీకే', 'దంగల్' సినిమాలను కూడా సచిన్ ప్రశంసించాడు. ఆమిర్ ఖాన్ 'దంగల్'ను ప్రత్యేకంగా సచిన్‌కు చూపించడం అనంతరం ఆ సినిమా అద్భుతమని సచిన్ మెచ్చుకోవడం వీరి మధ్య ఉన్న స్నేహానికి ఉదాహరణ. హీరోయిన్ల గురించి మాత్రం సచిన్ ఎక్కడా ఎలాంటి కామెంట్స్ చేయలేదు.

Story first published: Wednesday, September 3, 2025, 13:41 [IST]
Other articles published on Sep 3, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+