Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IML 2025: మళ్లీ బ్యాట్ పట్టిన సచిన్ ... ట్రేడ్ మార్క్ షాట్స్‌తో రఫ్పాడించిన మాస్టర్..!(వీడియో)

క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మళ్లీ బ్యాట్ పట్టాడు. తనకే సాధ్యమైన స్ట్రైట్ డ్రైవ్ ట్రేడ్ మార్క్ షాట్స్‌తో బౌలర్లకు చుక్కలు చూపించాడు. ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 'ది గోట్ ఈజ్ బ్యాక్.. సచిన్ బ్యాటింగ్ చూసేందుకు ఆతృతగా ఉన్నాం'అని కామెంట్ చేస్తున్నారు.

ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ ఇంటర్నేషనల్ మాస్టర్ లీగ్(ఐఎమ్ఎల్) టీ20 టోర్నీ కోసం సన్నదమవుతున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఈ టోర్నీ కోసం నెట్స్‌లో చెమటోడుస్తున్నాడు. సచిన్ బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను నిర్వాహకులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అలనాటి ఆటగాళ్లతో ఈ టోర్నీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Sachin Tendulkar Hits The Nets Ahead Of IML 2025 Video Goes Viral

ఫిబ్రవరి 22 నుంచి మార్చి 16 వరకు నవీ ముంబై, రాయ్‌పూర్ వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం 6 జట్లు ఈ టోర్నీ బరిలో నిలవగా.. ప్రతీ జట్టు రెండేసి మ్యాచ్‌లు ఆడనుంది. ఇండియా మాస్టర్స్, శ్రీలంక మాస్టర్స్, వెస్టిండీస్ మాస్టర్స్, ఆస్ట్రేలియా మాస్టర్స్, ఇంగ్లండ్ మాస్టర్స్, సౌతాఫ్రికా మాస్టర్స్ జట్లు ఈ టోర్నీ బరిలో నిలిచాయి. ఇండియా మాస్టర్స్‌కు సచిన్ టెండూల్కర్ సారథ్యం వహిస్తుండగా.. శ్రీలంకకు కుమార సంగక్కర, వెస్టిండీస్‌కు బ్రియాన్ లారా, ఆస్ట్రేలియాకు షేన్ వాట్సన్, ఇంగ్లండ్‌కు ఇయాన్ మోర్గాన్, సౌతాఫ్రికాకు జాక్వెస్ కల్లీస్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.

భారత జట్టులో సచిన్ టెండూల్కర్‌తో పాటు అలనాటి స్టార్స్ యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, యుసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, స్టువర్ట్ బిన్నీ, ధావల్ కులకర్ణి, వినయ్ కుమార్, షెహ్‌బాజ్ నదీమ్, రాహుల్ శర్మ, నమన్ ఓజా, పవన్ నేగీ, గుర్‌క్రిత్ సింగ్, అభిమన్యు మిథున్‌లు ఉన్నారు.

ఇండియా మాస్టర్స్
సచిన్ టెండూల్కర్ (సి), యువరాజ్ సింగ్, సురేష్ రైనా, అంబటి రాయుడు, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, స్టువర్ట్ బిన్నీ, ధవల్ కులకర్ణి, వినయ్ కుమార్, షాబాజ్ నదీమ్, రాహుల్ శర్మ, నమన్ ఓజా, పవన్ నేగి, గురుకీరత్ సింగ్ మాన్, అభిమన్యు మిథున్.

Story first published: Monday, February 17, 2025, 21:58 [IST]
Other articles published on Feb 17, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+