Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మాస్టర్ మంచి మనసు.. అనాథ పిల్లల చికిత్సకు సచిన్ చేయూత

Sachin Tendulkar helps in treatment of underprivileged kids

ముంబై: భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ సచిన్‌ టెండూల్కర్‌ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు. తీవ్రమైన జబ్బులతో బాధపడే 100 మంది అనాథ చిన్నారులకు ఆర్థిక సహాయాన్ని అందించనున్నాడు. ఈ మేరకు మాస్టర్‌తో కలిసి పని చేస్తున్న చారిటీ ఫౌండేషన్ 'ఏకం' ఈ విషయాన్ని వెల్లడించింది. తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు ప్రభుత్వ, ట్రస్ట్ ఆసుపత్రుల్లో సరైన ట్రీట్‌మెంట్ ఇప్పించడంలో ఏకం కీలక పాత్ర పోషిస్తోంది.

ఇందులో భాగంగానే మహారాష్ట్ర, బెంగాల్‌, అసోం, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని చిన్నారుల చికిత్సకు అయ్యే ఖర్చును సచిన్ భరించనున్నాడు. 'సచిన్‌తో అసోసియేషన్ చాలా సంతోషంగా సాగిపోతున్నది. హెల్త్ కేర్ విభాగంలో మాస్టర్ చాలా అద్భుతమైన సేవలు చేస్తున్నాడు. అనాధ పిల్లలకు క్వాలిటీ ట్రీట్‌మెంట్ ఇప్పించడంలో టెండూల్కర్ ఫౌండేషన్ మేనేజింగ్ పార్ట్‌నర్ అమితా చటర్జీ వెల్లడించారు.

ఈ నెలారంభంలో అసోంకు చెందిన ఓ ఆస్పత్రికి పీడియాట్రిక్‌ పరికరాలను కూడా సచిన్‌ అందించాడు. దీనిద్వారా ప్రతీ ఏడాది 2వేల మంది చిన్నారులు లబ్ది పొందనున్నారు. మధ్యప్రదేశ్‌లోని గిరిజన తెగల్లోని చిన్నారులకు కూడా పోషకాహారం, విద్యా వసతులను సచిన్‌ ఫౌండేషన్‌ అందించింది.

Story first published: Tuesday, December 1, 2020, 8:01 [IST]
Other articles published on Dec 1, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+