Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యువీనా.. బుమ్రానా.. ఆ ఇన్నింగ్స్ యాదికొచ్చింది: సచిన్ టెండూల్కర్

Sachin Tendulkar hails Jasprit Bumrah smacks Stuart Broad in most expensive Test over

ముంబై: టీమిండియా తాత్కలిక కెప్టెన్, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రాపై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. బుమ్రా బ్యాటింగ్ చూసిన తర్వాత ఆడుతుంది బుమ్రానా? యువీనా అనే సందేహం కలిగిందన్నాడు. బుమ్రా సూపర్ బ్యాటింగ్‌తో తనకు 2007 టీ20 ప్రపంచకప్‌లో యువ రాజ్ సింగ్ (6 బంతుల్లో 6 సిక్స్‌ల) ఇన్నింగ్స్ యాది కొచ్చిందని ట్వీట్ చేశాడు. ఏందిది... యువీ నా బుమ్రా నా... 2007 గుర్తుకు వచ్చింది...' అంటూ యువరాజ్ సింగ్, జస్ప్రిత్ బుమ్రాలను సచిన్ టెండూల్కర్ ట్యాగ్ చేశాడు.

బుమ్రా వరల్డ్ రికార్డు..

బుమ్రా వరల్డ్ రికార్డు..

ఇంగ్లండ్‌తో బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో బుమ్రా దుమ్మురేపిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లు బౌలింగ్‌లో సత్తా చాటిన బుమ్రా.. కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న తర్వాత బ్యాటింగ్‌‌లోనూ మెరిసాడు. ప్రొఫెషనల్ బ్యాటర్‌ను తలపిస్తూ ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా దిగ్గజ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. ఒకే ఓవర్‌లో 35 పరుగులు పిండుకొని వరల్డ్ రికార్డు నమోదు చేశాడు.

వరుస బౌండరీలతో..

వరుస బౌండరీలతో..

భారత్ ఇన్నింగ్స్ సందర్భంగా స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఇన్నింగ్స్ 84వ ఓవర్‌లో బుమ్రా ధాటిగా ఆడటంతో 4, 5(వైడ్), 7(నోబాల్), 4, 4, 4, 6, 1తో 35 పరుగులు వచ్చాయి. ఇందులో బుమ్రా బ్యాట్ నుంచి 29 రన్స్ రాగా.. మిగతావి ఎక్స్‌ట్రాల రూపంలో లభించాయి. తొలి బంతిని బుమ్రా హుక్ చేసి ఫోర్ రాబట్టగా.. రెండో బంతిని బ్రాడ్ బౌన్సర్ వేసాడు. అది వైడ్‌గా వెళ్లి బౌండరీ లైన్ ధాటింది. తర్వాతి బాల్‌ను టాప్ ఎడ్జ్‌తో సిక్సర్ కొట్టాడు. కానీ అది నోబాల్‌గా తేలింది.

కపిల్ దేవ్ స్టైల్లో..

కపిల్ దేవ్ స్టైల్లో..

తర్వాతి మూడు బంతులను బుమ్రా మిడాన్, ఫైన్ లెగ్ మిడ్ వికెట్ వీదుగా బౌండ్రీకి తరలించాడు. ఐదో బంతిని కపిల్ దేవ్ నటరాజ స్టైల్లో డీప్ బ్యాక్ వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా సిక్సర్‌గా మలిచాడు. చివరి బాల్‌కు సింగిల్ తీసాడు. దాంతో టెస్ట్‌ల్లో ఒకే ఓవర్లో ఎక్కువ రన్స్ ఇచ్చిన బౌలర్‌గా బ్రాడ్ చెత్త రికార్డు ఖాతాలో వేసుకోగా.. టెస్ట్‌ల్లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసి బ్యాటర్‌గా బుమ్రా చరిత్రకెక్కాడు. 2003లో జొహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికా బౌలర్‌ ఆర్.పీటర్సన్ బౌలింగ్‌లో వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియన్‌ లారా 28 పరుగులు రాబట్టాడు. ఇప్పుడు వరకు అదే ప్రపంచ రికార్డు కాగా.. ఇప్పుడు బుమ్రా 29 పరుగులు సాధించి లారా రికార్డును బద్దలు కొట్టాడు. టీ20 వరల్డ్ కప్‌లో ఇదే బ్రాడ్ ఓవర్లో యురాజ్‌‌సింగ్ 6 సిక్స్‌లు కొట్టిన విషయం తెలిసిందే.

Story first published: Sunday, July 3, 2022, 15:06 [IST]
Other articles published on Jul 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+