
స్టార్టింగ్ ప్రాబ్లమ్‌తోనే..
విరాట్ కోహ్లీకి స్టార్టింగ్ ప్రాబ్లమ్ మొదలైందని, మంచి ఆరంభం అందకపోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాడని తెలిపాడు. ఆ ఆందోళన అతని ఫుట్‌వర్క్‌పై ప్రభావం చూపుతుందని మాస్టర్ చెప్పుకొచ్చాడు. ఈ సమస్య ప్రతి బ్యాట్స్‌మెన్ ఎదుర్కొంటాడని ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 'ఇప్పటివరకు కోహ్లీకి మంచి ఆరంభం దక్కలేదు. అయితే, ఇక్కడ ఆలోచనా విధానమే టెక్నికల్ సమస్యలకు దారి తీస్తుంది. ఎవరైనా మొదట్లో సరిగ్గా ఆడకపోతే తర్వాత అనేక విషయాలపై ఆలోచిస్తారు. ఎందుకంటే బ్యాట్స్‌మన్‌పై మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఒక బ్యాట్స్‌మన్ ఫామ్‌లో లేకపోతే ఆట నుంచి పక్కకు తప్పుకోవాలి. లేదా ఆడుతున్న విధానానికే కట్టుబడి ఉండాలి. ఇది ఎవరికైనా జరిగేదే. అయితే, ఫామ్‌లో ఉండటం అనేది కూడా బ్యాట్స్‌మన్ ఆలోచనా విధానంపై ఆధారపడి ఉంటుంది. అప్పుడు శరీరం కూడా సహకరించాలి.' అని సచిన్ టెండూల్కర్ చెప్పుకొచ్చాడు.

రోహిత్ అద్భుతం..
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మపై సచిన్ ప్రశంసల జల్లు కురిపించాడు. సుదీర్ఘ పార్మాట్ ఆడే విషయంలో అతను ఎంతో పరణితి సాధించాడని కొనియాడాడు. బంతులను వదిలేయడమే కాకుండా అద్భుతంగా డిఫెన్స్ చేస్తున్నాడని మెచ్చుకున్నాడు. 'నేను ఏదైతే చూసానో అదే నమ్ముతా. రోహిత్ చాలా అద్భుతంగా ఆడాడు. తన బ్యాటింగ్ టెంపర్మెంట్‌లోని మరో కోణాన్ని చూపించాడు. పరిస్థితులకు తగ్గట్టు తనని తాను ఎలా మలుచుకుంటాడో కూడా చాటిచెప్పాడు. మరోవైపు అతడికి రాహుల్ నుంచి కూడా మంచి సహకారం అందింది. ఇక పుల్ షాట్ల విషయానికొస్తే ఇదివరకే అలాంటి షాట్లతో బౌండరీలు సాధించాడు. బంతిని ఎలా ఆడాలి, ఎలా వదిలేయాలనే విషయాలపైనా మంచి నైపుణ్యం సాధించాడు. అలాగే ఇంగ్లాండ్‌లో ఇటీవల అతడు ఆడుతున్న తీరు చూస్తుంటే కచ్చితంగా అనుకున్న దానికన్నా పై స్థాయిలోనే ఉన్నాడు.
'అని సచిన్ సూచించాడు. ఇక తన ఫేవరేట్ షాట్ అయిన ఫుల్ షాట్ ఆడే క్రమంలో రోహిత్ రెండు సార్లు ఔటయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లు కావాలనే అతని ఊరించి ఔట్ చేస్తున్నారు. ఈ విషయం గ్రహించాలని రోహిత్‌కు ఇప్పటికే లక్ష్మణ్, గవాస్కర్ సూచించారు.

బుమ్రా, షమీ..
ఇక చివరి రోజు ఆటలో జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ కనబర్చిన పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువేనని సచిన్ అన్నాడు. వారి భాగస్వామ్యం మ్యాచ్ స్వరూపానే మార్చేసిందని కొనియాడాడు. 'బుమ్రా, షమీ ప్రదర్శన అద్భుతమని చెప్పడం కూడా తక్కువే. వారి భాగస్వామ్యం మ్యాచ్ స్వరూపాన్నే మర్చేసింది. వెల్‌డన్ షమీ, బుమ్రా'అని సచిన్ ప్రశంసించాడు.
181/6 ఓవర్ నైట్ స్కోర్‌తో చివరి రోజు ఆటను కొనసాగించిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో 298/8 వద్ద డిక్లేర్ చేసింది. మహమ్మద్ షమీ(70 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 56 నాటౌట్), జస్‌ప్రీత్ బుమ్రా(53 బంతుల్లో 2 ఫోర్లతో 36 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్‌తో 9వ వికెట్‌కు అజేయంగా 89 పరుగులు జోడించారు. దాంతో భారత్‌కు 271 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
అనంతరం 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 51.5 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌటైంది. జోస్ బట్లర్(96 బంతుల్లో 25), జోరూట్(60 బంతుల్లో 33) పోరాడినా ఫలితం లేకపోయింది.
భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(4/32) నాలుగు వికెట్లతో చెలరేగగా.. జస్‌ప్రీత్ బుమ్రా(3/33) మూడు, ఇషాంత్ శర్మ(2/13) రెండు వికెట్లు తీశారు. మహమ్మద్ షమీ(1/13)కి ఒక వికెట్ దక్కింది. ఈ విజయంతో ఐదు టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-0తో బోణీ కొట్టింది. ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ ఆగస్టు 25న(బుధవారం) లీడ్స్ వేదికగా జరగనుంది.


Click it and Unblock the Notifications
