శెభాష్ సిరాజ్.. ఒక్క వికెట్ తీసినా నీ బౌలింగ్ సూపర్: సచిన్ టెండూల్కర్

బ్రిస్బేన్: టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్టులో భారత పేస్ దళాన్ని హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ ముందుండి నడిపిస్తున్నాడు. ఆడేది మూడో టెస్టే అయినప్పటికీ సహచర ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేస్తూ సమర్థవంతంగా పేస్ బాధ్యతల్ని మోస్తున్నాడు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో ఈ హైదరాబాద్ గల్లీ బాయ్ ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. రెండో రోజు ఆటలో బంతితో ప్రభావం చూపినప్పటికీ వికెట్లు సాధించలేకపోయాడు. ఈ నేపథ్యంలో మహ్మద్ సిరాజ్‌పై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. తన బౌలింగ్ నైపుణ్యంతో పేస్ బాధ్యతల్ని మోస్తున్నాడని కొనియాడాడు.
అది సిరాజ్ సామర్థ్యమే..
ట్విటర్ వేదికగా సిరాజ్ బౌలింగ్‌ను సచిన్ విశ్లేషించాడు. పిచ్‌పై ఉన్న పగుళ్లతో సిరాజ్ స్వింగ్ రాబడుతున్నాడని వినిపిస్తున్న వాదనలను కొట్టిపారేశాడు. నైపుణ్యంతోనే స్వింగర్స్, కట్టర్స్‌ను అద్భుతంగా సంధిస్తున్నాడని తెలిపాడు. 'పిచ్‌పై ఉన్న పగుళ్ల సాయంతో మహ్మద్ సిరాజ్ బంతిని స్వింగ్ చేస్తున్నాడని కొందరు అంటున్నారు. అయితే అతని బౌలింగ్‌ను పరిశీలించాను. తెలివిగా, వైవిధ్యంగా బంతులు విసురుతున్నాడు.

బంతిపై షైన్‌ను..
బంతిపై ఉన్న షైన్‌ను ఉపయోగించుకుని ఫస్ట్ స్లిప్, సెకండ్ స్లిప్ లక్ష్యంగా బంతులు సంధిస్తున్నాడు. రెండు వేళ్లతో బంతుల్ని వదులుతూ స్వింగ్ రాబడుతున్నాడు. అలాగే కట్టర్ వేయాలనుకున్నప్పుడు బంతి షైన్‌ను ఎడమవైపునకు ఉండేలా ఉంచి, లేదా కోణాన్ని కాస్త మార్చి బంతులు వేస్తున్నాడు. అప్పుడు బంతి గింగరాలు తిరుగుతూ దూసుకెళ్తోంది. అది పిచ్ సాయంతో వచ్చింది కాదు.. కచ్చితంగా సిరాజ్ సామర్థ్యమే' అని సచిన్ వివరించాడు.

ఫస్ట్ ఓవర్‌లోనే..
ఈ మ్యాచ్‌లో సిరాజ్ ఫస్ట్ ఓవర్‌లోనే వికెట్ తీసి భారత్‌కు శుభారంభాన్ని అందించాడు. డేవిడ్ వార్నర్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత తనదైన స్వింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు. అయితే ఈ మ్యాచ్‌లోనూ సిరాజ్ జాత్యాహంకార దూషణలకు గురయ్యాడు. వికెట్ తీసాడని ఓర్వలేకపోయిన ఆసీస్ అభిమానులు మళ్లీ నోటికి పనిచెప్పారు. సుంధర్, సిరాజ్‌ను టార్గెట్ చేస్తూ మాటల దాడికి దిగారు.

శార్దుల్, సుందర్ సూపర్ బ్యాటింగ్..
ఇక మ్యాచ్ విషయానికొస్తే మూడో రోజు ఆటలోనూ భారత బ్యాట్స్‌మెన్ తడబడగా.. యువ ఆటగాళ్లు వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకుర్ సూపర్ బ్యాటింగ్‌తో ఆదుకున్నారు. అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆసీస్ బౌలర్లను విసిగిస్తున్నారు. ఆసీస్ కెప్టెన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ తరహాలో ధీటుగా బుదులిస్తున్నారు. ఇద్దరు హాఫ్ సెంచరీలు దిశగా దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం 94 ఓవర్లలో భారత్ 273/6 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications