కోహ్లీ, ధోనీ కాదు.. బ్రాండ్ విలువలో క్రికెట్ దేవుడే కింగ్!
టీమిండియా దిగ్గజం, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సరికొత్త రికార్డ్‌ను నమోదు చేశాడు. అత్యధిక బ్రాండ్ విలువ కలిగిన భారత రిటైర్డ్ ఆటగాడిగా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డ్స్ నమోదు చేసిన సచిన్ టెండూల్కర్.. రిటైర్మెంట్ ప్రకటించి 13 ఏళ్ల అవుతున్నా అతని క్రేజ్ మాత్రం ఇసుమంత కూడా తగ్గలేదు. నిరంతరం ఏదో ప్రకటనలో సచిన్ కనిపిస్తూనే ఉన్నాడు. అందుకే అతని బ్రాండ్ వాల్యూ ఏ మాత్రం తగ్గలేదు.
రిటైర్మెంట్ ప్రకటించిన క్రీడాకారుల్లో అత్యధిక బ్రాండ్ వాల్యూ కలిగిన ఆటగాడిగా సచిన్ రికార్డ్ సాధించాడు. విరాట్ కోహ్లీ, ధోనీ కంటే కూడా ఎక్కువ బ్రాండ్స్‌కు సచిన్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా క్రోల్ ఇండియా సెలెబ్రిటీ బ్రాండ్ వాల్యూయేష్ 2025 రిపోర్ట్ ప్రకారం సచిన్ విలువ దాదాపు రూ.1200 కోట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం సచిన్ వయసు 53 ఏళ్లు కాగా.. అతను అంతర్జాతీయ క్రికెట్‌లో 24 ఏళ్ల పాటు కొనసాగి 2013లో వీడ్కోలు పలికాడు. ఆటకు దూరమైనా.. ప్రకటనల్లో నటిస్తూ భారీగానే సంపాదిస్తున్నారు. భారత్‌లో టాప్-10 సెలబ్రిటీల్లో ఎక్కువ బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా ఉన్న రిటైర్డ్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ అని క్రోల్ ఇండియా తమ నివేదికలో పేర్కొంది. ప్రతీ సంవత్సరం అతని విలువ పెరుగుతోంది. అన్ని వయసుల వారికి అతను తెలియడంతో కంపెనీలు సచిన్‌తో ఒప్పందాలు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడా, ఏజియస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్, అపోలో టైర్స్, ఎస్‌ఎల్ లిమిటెడ్, హెఫెలె ఇండియా, ల్యూమినస్ పవర్ టెక్నాలజీస్, టానిష్క్, స్పిన్నీ, అన్‌అకాడమీ వంటి కంపెనీలకు సచిన్ టెండూల్కర్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
టెస్ట్ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ 200 మ్యాచ్‌ల్లో 15,921 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ ఫార్మాట్‌లో మరే ఆటగాడు కూడా సచిన్‌కు దరిదాపుల్లో లేరు. ఇందులో 51 టెస్ట్ శతకాలతో పాటు 2058 బౌండరీలు ఉన్నాయి. కేవలం 300 ఇన్నింగ్స్‌ల్లోనే సచిన్ 15,000 టెస్ట్ పరుగుల మైలురాయిని అందుకొని ఈ ఘనత సాధించిన ఫాస్టెస్ట్ బ్యాటర్‌గా రికార్డ్ సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

