ముంబై: టీమిండియా టెస్ట్ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ శనివారం (నవంబర్ 5)న 28వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా కోహ్లికి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. టీమిండియాలో కోహ్లీనే షరారతి గయ్(నాటీ బాయ్) అంటూ సచిన్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.
రన్ మెషిన్: 28వ పడిలోకి కోహ్లీ, సాధించిన రికార్డులివేకోహ్లీ ఎప్పుడూ తనలాగే ఉండాలని, భారత జట్టుకు మరెన్నో విజయాలను సాధించి పెట్టాలంటూ సచిన్ టెండూల్కర్ ఆకాంక్షించాడు. కోహ్లీ పుట్టినరోజుని పురస్కరించుకుని తన సహచర ఆటగాళ్లు అయిన శిఖర్ ధావన్, సురేశ్ రైనాలతో పాటు టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే, పలువురు మాజీలు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.