రన్ మెషిన్: 28వ పడిలోకి కోహ్లీ, సాధించిన రికార్డులివే
ముంబై: భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ శనివారం (నవంబర్ 5)న తన 29వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు ధోని రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన కోహ్లీ జట్టుని విజయ పథంలో నడిపిస్తున్నాడు.
ప్రపంచ క్రికెట్‌కు బీసీసీఐ అందించిన అత్యుత్తమ బ్యాట్స్ మెన్లలో విరాట్ కోహ్లీ ఒకడు. మూడు ఫార్మెట్లలో కూడా అద్భుతంగా రాణిస్తూ సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కోహ్లీ రన్ మెషిన్‌లాగా అన్ని ఫార్మాట్లలో విజృంభించాడు. ఇంగ్లాండ్‌తో జరగబోయే టెస్టు సిరిస్ కోసం సన్నద్ధమయ్యాడు.
ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కోహ్లీ టీమిండియాకు అనేక విజయాలను అందించాడు. అవేంటో ఒక్కసారి చూద్దాం:

భారత్ ఓటమి పాలైన కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన
ఆస్ట్రేలియా పర్యటనలో ధోనీ కెప్టెన్సీలో కోహ్లీ ఐదు వన్డేలు ఆడాడు. ఈ సిరీస్‌లో టీమిండియా 1-4తో ఓటమి పాలైనప్పటికి కోహ్లీ మాత్రం అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఈ సిరిస్‌లో కోహ్లీ రెండు సెంచరీలతో పాటు, రెండు అర్ధ సెంచరీలతో మొత్తం 381 పరుగులు చేశాడు. ఇదే పర్యటనలో భారత్ మూడు టి-20ల సిరీస్‌ను వైట్ వాష్ చేయడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. మూడు అర్ధ సెంచరీలతో మొత్తం 199 పరుగులు చేశాడు.

వన్డేల్లో 25 సెంచరీలు పూర్తి
వన్డేల్లో 25 సెంచరీలను పూర్తి చేశాడు. దీంతో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 7500 పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. అంతేకాదు వన్డేల్లో ఛేజింగ్ చేసి భారత్ గెలిచిన మ్యాచ్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్‌గా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ (14) సెంచరీల రికార్డును కోహ్లీ సమం చేశాడు.

వరల్డ్ టీ20లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ
ఇక ఈ ఏడాది జరిగిన ఆసియా కప్ ట్వంటీ20 టైటిల్ సాధించడంలో కోహ్లీ ప్రధాన పాత్ర పోషించాడు. ట్వంటీ20 వరల్డ్ కప్‌లో కూడా కోహ్లీ ఐదు మ్యాచ్‌ల్లో 273 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డుని గెలుచుకున్నాడు. ఇక బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఒక సీజన్‌లో 900 పరుగుల సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు.

ఏకైక టీమిండియా కెప్టెన్
దాంతో పాటు ఐపీఎల్‌లో ఒక సీజన్‌లో అత్యధిక సెంచరీలు (4) చేసిన బ్యాట్స్‌మెన్ గా కూడా మరో రికార్డు నెలకొల్పాడు. ఇక టెస్టు క్రికెట్ విషయానికి వస్తే వెస్టిండిస్, న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరిస్‌లలో డబుల్ సెంచరీలు సాధించాడు. టెస్టు క్రికెట్‌లో రెండు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక టీమిండియా కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications