Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఉమ్మిని నిషేధించారు సరే.. చెమట పట్టకపోతే ఏం చేస్తారు?: సచిన్

Sachin Casts Doubts Over Saliva Ban, Asks What Happens in Cold Conditions Where Players Dont Sweat

ముంబై: కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో సలైవా (ఉమ్మి) వాడకుండా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిషేధించడాన్ని క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ప్రశ్నించాడు. ఉమ్మికి బదులుగా చెమటను వాడవచ్చంటూ వస్తున్న సూచనలపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ వంటి చల్లని ప్రదేశాల్లో చెమట అంత సులభంగా రాదని సచిన్ పేర్కొన్నాడు.

 చెమట పట్టకపోతే ఏం చేస్తారు?:

చెమట పట్టకపోతే ఏం చేస్తారు?:

ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ బ్రెట్ ‌లీతో '100ఎంబీ' ద్వారా సచిన్‌ టెండూల్కర్‌ మాట్లాడుతూ ప్రస్తుత నిషేధంతో బౌలర్లు ఎదుర్కొనే కష్టాలను వివరించాడు. 'ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌ వంటి దేశాల్లో వాతావరణం (శీతల వాతావరణం) భిన్నంగా ఉంటుంది. అక్కడ చెమట రాకపోతే ఏం చేయాలి. ఆ దేశాల్లో పర్యటించేటప్పుడు ఆటగాళ్లు ఎక్కువ పొరలున్న దుస్తులు ధరిస్తుంటారు. 1992 మేలో నేను యార్క్‌షైర్‌లో పర్యటించినప్పుడు అక్కడ బాగా చలేసింది. ఐదు పొరల వస్త్రాలు ధరించాను. అలాంటప్పుడు చెమట రాకపోతే బంతికి మెరుపు ఎలా తీసుకొస్తాం' అని సచిన్‌ ప్రశ్నించాడు.

బౌలర్లు ఒక అవకాశం కోల్పోయినట్లే:

బౌలర్లు ఒక అవకాశం కోల్పోయినట్లే:

'మేం ఆడేటప్పుడు కొత్త బంతికి ఉమ్మిని రుద్దేవాళ్లం. పాత బంతిని రివర్స్‌స్వింగ్‌ చేసేందుకు చెమటను ఉపయోగించేవాళ్లం. అప్పుడు బంతి బరువులో సమతూకం పోయి స్వింగ్‌ అయ్యేది. బంతిని రివర్స్‌ చేయాలంటే రెండు దారులు ఉన్నాయి. ఒకటి బంతి బరువు అసమతౌల్యం చేయడం. రెండోది బంతిని నునుపుగా ఉంచడం. అయితే ఇప్పుడు సలైవా వద్దంటే బౌలర్లు ఒక అవకాశం కోల్పోయినట్లే. అయినా ఉమ్మి వాడటం అనారోగ్యకారణమైతే.. చెమట మాత్రం అంతకంటే మెరుగైనది ఎలా అవుతుందో నాకు అర్థం కావడం లేదు' అని లిటిల్ మాస్టర్ పేర్కొన్నాడు.

కొత్త బంతిని ముందే తేవాలి:

కొత్త బంతిని ముందే తేవాలి:

తాజా పరిస్థితుల్లో బౌలర్లకు కూడా ప్రయోజనం ఉండాలంటే.. రెండో కొత్త బంతిని 50-55 ఓవర్లకే తీసుకురావాలని సచిన్‌ టెండూల్కర్ సూచించాడు. 'ఒక్కసారి పిచ్‌ సాధారణంగా మారిపోతే.. ఆటలో నాణ్యత పడిపోతుంది. తననెవరూ అవుట్‌ చేయలేరని బ్యాట్స్‌మన్‌కు అర్థమైపోతుంది. మళ్లీ మ్యాచ్‌లో జీవం రావాలంటే.. తొందరగా కొత్త బంతితో బౌలర్‌కు అవకాశం ఇవ్వాలి' అని సచిన్‌ అభిప్రాయపడ్డాడు.

 సమతూకం కోసం పిచ్‌లను ఉపయోగించుకోండి:

సమతూకం కోసం పిచ్‌లను ఉపయోగించుకోండి:

క్రికెట్ బంతిపై మెరుపు తీసుకొచ్చేందుకు కృతిమ పదార్థాన్ని అనుమతించలేమని ఐసీసీ క్రికెట్‌ కమిటీ ఛైర్మన్‌, టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్‌ కుంబ్లే స్పష్టం చేశారు. బ్యాటు, బంతి మధ్య సమతూకం కోసం పిచ్‌లను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. 'క్రికెట్లో బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌లను రూపొందించి బంతి, బ్యాటుకు మధ్య సమతూకం తీసుకురావొచ్చు. పిచ్‌పై పచ్చికను ఉంచొచ్చు. సంప్రదాయ స్వింగ్‌, రివర్స్‌ స్వింగ్‌కు అనుకూలించకపోతే.. ఇద్దరు స్పిన్నర్లను ఆడించొచ్చు. వన్డే, టీ20ల గురించి ఎవరికీ ఎలాంటి ఆందోళన లేదు. టెస్టుల విషయంలో మాత్రమే ఆందోళన చెందుతున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పిచ్‌లపై ఇద్దరు స్పిన్నర్లతో ఆడించడం జరగదు. ఇప్పుడు ఇద్దరు స్పిన్నర్లను ఆడించొచ్చు' అని కుంబ్లే అన్నారు.

బ్యాటింగ్‌ కోచ్‌గా యూనిస్‌.. బౌలింగ్‌ కోచ్‌గా ముస్తాక్‌!!

Story first published: Wednesday, June 10, 2020, 8:40 [IST]
Other articles published on Jun 10, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+