Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్యాటింగ్‌ కోచ్‌గా యూనిస్‌.. బౌలింగ్‌ కోచ్‌గా ముస్తాక్‌!!

PCB names Younis Khan as Pakistan batting coach for England tour

కరాచీ: మాజీ కెప్టెన్‌ యూనిస్‌ ఖాన్‌ పాకిస్థాన్‌ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌గా నియమితుడయ్యాడు. త్వరలో జరుగనున్న ఇంగ్లండ్‌ సిరీస్‌ కోసం యూనిస్‌ను బ్యాటింగ్‌ కోచ్‌గా, ముస్తాక్‌ అహ్మద్‌ను స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా నియమిస్తూ పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముస్తాక్‌ అహ్మద్‌ జట్టు మెంటార్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

'అపార అనుభవం ఉన్న యూనిస్‌ ఖాన్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా వ్యవహరించేందుకు అంగీకరించాడు. ఇంగ్లండ్‌ గడ్డపై అతడి టెక్నిక్‌ కుర్రాళ్లకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లకు అతడు ఓ రోల్‌ మోడల్‌. శిక్షణ బృందంలో యూనిస్‌ ఉండటం పాక్ జట్టుకు తోడ్పడుతుంది. చాన్నాళ్లుగా కౌంటీ క్రికెట్‌ ఆడుతున్న ముస్తాక్‌ అహ్మద్‌.. ఇంగ్లిష్‌ గడ్డపై స్పిన్నర్లకు ఉపయోగపడుతాడు' అని పీసీబీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ వసీమ్‌ ఖాన్‌ మంగళవారం పేర్కొన్నాడు.

ఆగస్టు-సెప్టెంబర్‌ మధ్య ఇంగ్లాండ్‌ టూర్‌కు వెళ్లే పాకిస్తాన్ జట్టు మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌తో తలపడనుంది. పాక్‌ హెడ్‌ కోచ్‌గా మిస్బా హుల్‌ హక్‌, ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌గా వకార్‌ యూనిస్‌ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. జులై 30న పాక్‌, ఇంగ్లాండ్‌ మధ్య మూడు టెస్టుల సిరీస్‌ ఆరంభం కానుంది. ఇంగ్లాండ్‌ జట్టు పాక్ టూర్ కంటే ముందుగా.. వెస్టిండీస్ జట్టుతో సిరీస్ ఆడనుంది.

118 టెస్టుల్లో 10,099 పరుగులు చేసిన యూనిస్ ఖాన్.. ఆ దేశం తరఫున సంప్రదాయక ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. ఇక 265 వన్డేల్లో 7,249 పరుగులు చేసిన ఈ మాజీ కెప్టెన్.. ఓవరాల్‌గా 41 సెంచరీలతో 2017లో అంతర్జాతీయ క్రికెట్‌‌కు గుడ్‌బై చెప్పాడు. ఇక 25 టీ20ల్లో 442 రన్స్ చేసాడు. పాక్ తరఫున ముస్తాక్ 52 టెస్టులు, 144 వ‌న్డేలు ఆడాడు. టెస్టుల్లో 185, వన్డేల్లో 161 వికెట్లు పడగొట్టాడు.

Story first published: Wednesday, June 10, 2020, 7:55 [IST]
Other articles published on Jun 10, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+