Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గాయాన్ని దాచిపెట్టడం ఆశ్చర్యకరంగా ఉంది..ఫిజియోలు, ట్రెయినర్లు ఏం చేస్తున్నారు!బీసీసీఐపై మాజీ క్రికెటర్ ఫైర్!

Saba Karim slams BCCI over Shubman Gills hide injury

ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారులపై టీమిండియా మాజీ క్రికెటర్‌ సాబా కరిమ్‌ మండిపడ్డారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ముందు యువ ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌ గాయపడ్డా.. ఆ విషయాన్ని దాచిపెట్టడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. భారత జట్టులో అనేక మంది ఫిజియోలు, ట్రెయినర్లు ఉన్నా.. ఒక్కరు కూడా అతడి గాయాన్ని గుర్తించలేకపోయారని విమర్శించారు. బీసీసీఐ పొరపాటు కారణంగానే గిల్‌ ఇప్పుడు సుమారు రెండు నెలలు ఆటకు దూరమయ్యే అవకాశం ఉందని సాబా కరిమ్‌ పేర్కొన్నారు.

సిరీస్ మొత్తానికి దూరం

సిరీస్ మొత్తానికి దూరం

ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ భారత్ ఆడనుంది. అయితే ఈ సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సేవలను కోల్పోయింది. అతను ఎడమ పిక్క కండరాల గాయంతో బాధపడుతున్నాడని, 6 నుంచి 8 వారాల విశ్రాంతి అవసమరని జట్టు మేనేజ్మెంట్ తెలిపింది. దాంతో అతను ఇంగ్లండ్‌తో సిరీస్ మొత్తానికి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో యువ ఓపెనర్ పృథ్వీ షాకు బీసీసీఐ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. శ్రీలంక పర్యటనలో ఉన్న అతడిని ఇంగ్లండ్‌కు పంపించాలని బీసీసీఐ భావిస్తోందట.

పృథ్వీ షాకు పిలుపు:

పృథ్వీ షాకు పిలుపు:

శుభ్‌మన్ గిల్‌కి ప్రత్యామ్నాయంగా ఇప్పటికే కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, అభిమన్యు ఈశ్వరన్‌ జట్టులో ఉన్నారు. రోహిత్‌ శర్మతో పాటు అగర్వాల్‌ను ఓపెనింగ్‌ చేయించే అవకాశం ఉంది. మరోవైపు రాహుల్‌ను మిడిలార్డర్‌లో ఆడించాలని జట్టు యాజమాన్యం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అరంగేట్రం చేయలేదు కాబట్టి ఈశ్వరన్‌కు వెంటనే అవకాశం ఇవ్వకపోవచ్చు. సుదీర్ఘ సిరీస్‌ కావడంతో వీరిలో ఎవరైనా గాయపడే అవకాశం ఉందని, ముందు జాగ్రత్తగా పృథ్వీ షాను పిలుపించే అవకాశం ఉన్నట్లు జట్టు వర్గాలు పేర్కొన్నాయి.

అప్పుడు విరాట్ కోహ్లీని చూసి చాలా ఆశ్చర్యపోయా: కమ్రన్‌ అక్మల్‌

చాలా ఆశ్చర్యం కలిగించింది

చాలా ఆశ్చర్యం కలిగించింది

తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌ షోలో మాట్లాడిన సాబా కరిమ్‌ యువ క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ గాయంపై స్పందించారు. 'శుభ్‌మన్‌ గిల్‌ తన గాయాన్ని దాచిపెట్టడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. గిల్‌ చాలా కాలంగా భారత జట్టుతో కలిసి ప్రయాణిస్తున్నాడు. అక్కడ ఫిజియోలు, వైద్య సహాయకులు ఎప్పటికప్పుడు ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ పరీక్షిస్తుంటారు.

అసలా గాయం ఎప్పుడు జరిగింది. గిల్ ఎందుకు దాన్ని దాచిపెట్టాడనే విషయాలు ఆశ్చర్యంగా ఉన్నాయి' అని అన్నారు. గతంలో రోహిత్‌ శర్మను గాయం కారణంగా ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయని సంగతి తెలిసిందే. దాంతో న్యూజిలాండ్‌తో తుది పోరుకు ముందు గాయపడ్డానని తెలిస్తే జట్టులో నుంచి తొలగిస్తారనే కారణంగా గిల్‌ తన గాయం విషయాన్ని దాచిపెట్టి ఉంటాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

డబ్ల్యూటీసీ ఫైనల్లో విఫలం

డబ్ల్యూటీసీ ఫైనల్లో విఫలం

గతేడాది ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌ల్లో 440 పరుగులు చేసిన శుభ్‌మన్ గిల్.. ఈ ఏడాది ఆరంభలో జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలోనూ అదే జోరు కనబర్చాడు. కానీ ఆ తర్వాత ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఇంగ్లండ్‌తో పాటు ఐపీఎల్‌ 2021లోనూ దారుణంగా విఫలమయ్యాడు. 7 మ్యాచ్‌ల్లే కేవలం 132 పరుగులే చేశాడు. ఆపై డబ్ల్యూటీసీ ఫైనల్ 2021లోనూ నిరాశపరిచాడు. గిల్ ఇప్పటి వరకు 8 టెస్టులు ఆడాడు. 31.84 సగటుతో అతను 414 రన్స్ చేశాడు. అతని కెరీర్‌లో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Story first published: Sunday, July 4, 2021, 15:38 [IST]
Other articles published on Jul 4, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+