Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అప్పుడు విరాట్ కోహ్లీని చూసి చాలా ఆశ్చర్యపోయా: కమ్రన్‌ అక్మల్‌

Kamran Akmal said I was so surprised when I saw young Virat Kohli in IPL 2008

కరాచీ: 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభ ఎడిషన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడిన ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని చూసి చాలా ఆశ్చర్యపోయా అని పాకిస్థాన్‌ వెటరన్‌ బ్యాట్స్‌మన్‌, కీపర్‌ కమ్రన్‌ అక్మల్‌ తెలిపాడు. ఐపీఎల్ ప్రారంభ ఎడిషన్‌లో పాకిస్తాన్ క్రికెటర్లను కూడా ఆడారు. టోర్నమెంట్‌లో పాల్గొన్న అతికొద్ది మంది ఆటగాళ్లలో అక్మల్ కూడా ఒకడు. మొదటి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీకి అతడు ఆడాడు. 2008లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు అండర్ -19 ప్రపంచకప్‌ను గెలుచుకోటంతో కోహ్లీ బెంగళూరు జట్టుకు ఎంపికయ్యాడు.

అప్పుడు చాలా ఆశ్చర్యపోయా

అప్పుడు చాలా ఆశ్చర్యపోయా

అవేల్ సావేరా పాషా యూట్యూబ్ ఛానల్ 'హార్డ్ టాక్ విత్ కమ్రన్‌ అక్మల్' అనే షో చేసింది. ఇందులో కమ్రన్‌ ఎన్నో విషయాలపై స్పందించాడు. ఈ క్రమంలో 2008 ఐపీఎల్ ట్రోఫీని గుర్తుచేసుకున్నాడు. 'నేను ఐపీఎల్ మొదటి ఎడిషన్ ఆడాను. ఆ సమయంలో విరాట్ కోహ్లీని చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఇంత చిన్న వయసులో ఎలాంటి క్రికెట్ ఆడతాడో అనుకున్నా. కానీ కోహ్లీ ఇప్పుడు తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు. అతను ఇప్పుడు యువ ఆటగాళ్లు ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. కోహ్లీ అద్భుతమైన ఆటగాడు. మంచి కెప్టెన్' అని కమ్రన్‌ పేర్కొన్నాడు.

అందులో కోహ్లీ తప్పేముంది

అందులో కోహ్లీ తప్పేముంది

'ఎంఎస్ ధోనీ తర్వాత విరాట్‌ కోహ్లీ అత్యుత్తమ కెప్టెన్‌. కోహ్లీ పేరిట 70 అంతర్జాతీయ శతకాలున్నాయి. అతడు 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ, 2019 ప్రపంచకప్‌ ఆడాడు. అయితే అక్కడ భారత్‌ విఫలమైనా అందులో కోహ్లీ చేసిన తప్పేముంది?. అతడి సారథ్యంలోనే భారత్ టెస్టుల్లో వరుసగా ఐదేళ్లు టాప్‌లో కొనసాగింది. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీ కెప్టెన్సీని గమనించండి. అతడి ఆటతీరును పరిశీలించండి. అతడి సారథ్యం అత్యద్భుతం. అందులో ఎలాంటి సందేహం లేదు' అని కమ్రన్‌ అక్మల్ అన్నాడు.

INDW vs ENGW: 'సూపర్ వుమెన్' స్మృతి మంధాన స్టన్నింగ్‌ క్యాచ్‌.. చూస్తే షాకే (వీడియో)!!

ఐసీసీ టోర్నీ గెలుస్తారన్న గ్యారంటీ ఏమైనా ఉందా

ఐసీసీ టోర్నీ గెలుస్తారన్న గ్యారంటీ ఏమైనా ఉందా

'మైదానంలో విరాట్ కోహ్లీ దూకుడుగా కనిపిస్తాడు. ఎంతో భావోద్వేగంతో ఉంటాడు. టీమిండియాకు వచ్చిన ఏ నాయకుడైనా.. భారత క్రికెట్‌ను ముందుకే తీసుకెళ్తున్నాడు. సౌరవ్‌ గంగూలీతో ఇది మొదలైంది. ఆ తర్వాత రాహుల్‌ ద్రవిడ్‌, ఎంఎస్‌ ధోనీ బాధ్యతలు స్వీకరించారు. అందరూ జట్టును సమర్ధవంతంగా ముందుకు నడిపారు.

విరాట్‌ కోహ్లీ ఐసీసీ ట్రోఫీలు గెలవలేదని అందరూ ప్రశ్నిస్తున్నారు. కానీ అవి తప్ప మిగతావన్నీ సాధించాడు. కోహ్లీ కెప్టెన్సీలో భారత్ ఎన్నో సిరీసులు గెలిచింది. భారత్ ఐసీసీ టోర్నీలు గెలవకపోవడం పూర్తిగా కోహ్లీ ఒకడి తప్పు ఏమాత్రం కాదు. అతడి స్థానంలో మరొకరు వచ్చి.. ఐసీసీ టోర్నీ గెలుస్తారన్న గ్యారంటీ ఏమైనా ఉందా?. కీలక టోర్నీల్లో ఎందుకు విఫలమవుతున్నారో జట్టుగా విశ్లేషించుకోవాలి' అని కమ్రన్‌ అక్మల్ సూచించాడు.

మీమ్స్‌తో కోహ్లీని ఎగతాళి

మీమ్స్‌తో కోహ్లీని ఎగతాళి

మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నుంచి విరాట్‌ కోహ్లీ జట్టు పగ్గాలు అందుకున్నాడు. ఇప్పటి వరకు మూడు ఐసీసీ టోర్నీల్లో టీమిండియాకు సారథ్యం వహించాడు. ఆ మూడింట్లో ఎందులోనూ భారత్‌ ట్రోఫీ గెలవలేదు. 2017 ఐసీసీ ట్రోఫీలో పాకిస్తాన్ చేతిలో ఫైనల్‌లో ఓడింది. 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌లో న్యూజీలాండ్ చేతిలో ఓటమి చవిచూసింది. తాజాగా జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో మరోసారి కివీస్‌తో ఓడింది. దాంతో నెటిజన్లు మీమ్స్‌తో కోహ్లీని ఎగతాళి చేస్తున్నారు. అంతేకాదు కోహ్లీ నుంచి నాయకత్వ బాధ్యతలు మరొకరికి అప్పజెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Story first published: Sunday, July 4, 2021, 14:13 [IST]
Other articles published on Jul 4, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+