Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా భవిష్యత్తు కేఎల్ రాహులే: భారత మాజీ క్రికెటర్

Saba Karim says The Upcoming Decade Will Belong To KL Rahul
IND VS SA: Virat Kohli గాయం పై Rohit Sharma Fans సెటైర్స్! | Oneindia Telugu

న్యూఢిల్లీ: టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై మాజీ క్రికెటర్ సబా కరీం ప్రశంసల జల్లు కురిపించాడు. ఇటీవల కాలంలో రాహుల్ అద్భుతంగా రాణిస్తున్నాడని, మూడు ఫార్మాట్లలో సత్తా చాటుతున్నాడని కొనియాడుతున్నాడు. టీమిండియా భవిష్యత్తు సారథి అతనేనని జోస్యం చెప్పాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌కు బ్యాక్ పెయిన్‌తో కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమవడంతో రాహుల్ తాత్కలిక సారథిగా బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలోనే రాహుల్ గురించి ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడిన సబాకరీమ్ అతన్ని పొగడ్తలతో ఆకాశానికెత్తాడు. భవిష్యత్తుతో పూర్తి స్థాయి టీమిండియా సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు అతనికి అన్ని అర్హతలు ఉన్నాయని అభిప్రాయపడ్డాడు.

రాహుల్‌దే రానున్న దశాబ్దకాలం..

రాహుల్‌దే రానున్న దశాబ్దకాలం..

'భారత క్రికెట్‌లో రానున్న దశాబ్ద కాలం కేఎల్ రాహుల్‌దే. భవిష్యత్తులో అతను తిరుగులేని నాయకుడిగా ఎదుగుతాడు. టీమిండియా టెస్ట్ కెప్టెన్ కోహ్లీ, పరిమిత ఓవర్ల సారథి రోహిత్‌ శర్మల గైర్హాజరీలో రాహుల్‌కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పడం సరైన నిర్ణయం. టెక్నిక్‌తో పాటు దూకుడును ప్రదర్శించడంలో రాహుల్‌ దిట్ట. ప్రస్తుతం కెరీర్‌ అత్యుత్తమ దశలో కొనసాగుతున్నాడు. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే భవిష్యత్తులో అతనికి తిరుగుండదు.

సారథిగా సత్తా చాటాడు..

సారథిగా సత్తా చాటాడు..

బ్యాట్స్‌మన్‌గానే కాకుండా సారథిగా కూడా అతను ఇదివరకే నిరూపించుకున్నాడు. ఐపీఎల్‌లో పంజాబ్‌ కెప్టెన్‌గా ఆ జట్టును నడిపించిన తీరే అతని కెప్టెన్సీ స్కిల్స్‌కు నిదర్శనం. భవిష్యత్తులో రాహుల్‌ను అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌గా నియమిస్తే.. జట్టును తిరుగులేని శక్తిగా నిలబెట్టడంతో పాటు క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్‌గా అవతరిస్తాడు. ఎవరికీ సాధ్యం కాని ఎన్నో రికార్డులు నెలకొల్పుతాడు.'అని సబా కరీం చెప్పుకొచ్చాడు.

టీమిండియాకు షాక్..

టీమిండియాకు షాక్..

సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. గాయంతో దూరమైన విరాట్ కోహ్లీ స్ధానంలో తెలుగు క్రికెటర్ హనుమ విహారి జట్టులోకి వచ్చాడు. ఇక ఎన్నో అంచనాలతో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. ఫస్ట్ టెస్ట్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన మయాంక్ అగర్వాల్(37 బంతుల్లో 5 ఫోర్లతో 26) ఆ జోరును కొనసాగించలేకపోయాడు. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారా క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. కానీ స్వేచ్చగా ఆడలేక ఓలివర్ బౌలింగ్‌లో వికెట్ సమర్పించుకున్నాడు. ఆ మరుసటి బంతికే క్రీజులోకి వచ్చిన హనుమ విహారీ(0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. దాంతో భారత్ 49 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హనుమ విహారీ(45 బంతుల్లో 2 ఫోర్లతో 16 బ్యాటింగ్)తో మరో వికెట్ పడకుండా రాహుల్(101 బంతుల్లో 6 ఫోర్లతో 30 బ్యాటింగ్) జాగ్రత్తగా ఆడుతున్నాడు.

Story first published: Monday, January 3, 2022, 17:17 [IST]
Other articles published on Jan 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+