
సూపర్ కెప్టెన్సీ..
ఐపీఎల్ 2021 ఫస్టాఫ్‌లో ఏడు మ్యాచ్‌లాడిన రోహిత్ శర్మ 35.71 సగటుతో 250 పరుగులు చేశాడు. ఇందులో ఒకే ఒక అర్ధశతకం ఉండగా.. 11 సిక్సర్లు, 18 ఫోర్లు ఉన్నాయి. అయితే.. అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మ రాణిస్తున్న తీరుతో పోలిస్తే..? ఈ స్కోర్లు చాలా తక్కువని సబా కరీమ్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ సెకండాఫ్ కోసం ఇప్పటికే ఇంగ్లండ్ నుంచి యూఏఈకి చేరుకున్న రోహిత్ శర్మ.. ప్రస్తుతం ఆరు రోజుల క్వారంటైన్‌లో ఉన్నాడు. చెన్నై ఇప్పటి వరకూ మూడు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలవగా.. ముంబై టీమ్ ఐదు టైటిల్స్‌తో టాప్‌లో ఉంది. ఐపీఎల్‌లో ఈ రెండు జట్లు చిరకాల ప్రత్యర్థులు. ఈ బిగ్ ఫైట్ నేపథ్యంలో ఓ యూట్యాబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సబా కరీమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

బ్యాట్స్‌మన్‌గా విఫలం..
'రోహిత్ శర్మ బ్యాటింగ్‌ను ఇంకాస్త మెరుగు పర్చుకోవాలి. నిజమే.. అతని కెప్టెన్సీలో ముంబై టీమ్ ఐదు టైటిల్స్ గెలిచింది. అది వేరే సంగతి. అయితే.. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే..? ముంబై టీమ్‌లో చాలా మంది మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. దాంతో.. రోహిత్ శర్మ పేలవ బ్యాటింగ్ ప్రదర్శన గురించి పెద్దగా చర్చ జరగడం లేదు. కానీ.. టీమ్‌లో అతని రోల్ బ్యాట్స్‌మెన్. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో చక్కగా రాణిస్తున్న రోహిత్ శర్మ.. అదే ఫామ్‌ని ఐపీఎల్‌లో కనబర్చలేకపోతున్నాడు'' అని సబా కరీమ్ తెలిపాడు.

పరుగులు చేస్తే..
అయితే రోహిత్ శర్మ బ్యాటింగ్ వైఫల్యానికి కెప్టెన్సీ కారణం కావచ్చని సబా కరీమ్ అభిప్రాయపడ్డాడు. 'కొన్ని సార్లు కెప్టెన్సీ ఆటగాళ్ల ఆటతీరుపై ప్రభావం చూపిస్తుందా? అనిపిస్తోంది. కెప్టెన్సీ ఒత్తిడి కారణంగా అతను పరుగు చేయలేకపోతున్నాడేమో. అయితే ఓ బ్యాట్స్‌మన్ కెప్టెన్ అయినప్పుడు.. పరుగులు చేస్తే అతని ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. ఫలితంగా కెప్టెన్సీ కూడా మెరుగుపడుతుంది. కాబట్టి పరుగులు చేయడంపైనే ఏ బ్యాట్స్‌మన్ కెప్టెన్ అయిన దృష్టిపెట్టాలి. అయితే ఈ సారి రోహిత్ రాణిస్తాడని ఆశిస్తున్నా.'అని సబాకరీమ్ చెప్పుకొచ్చాడు.

ప్లేయర్స్‌కు నో రెస్ట్..
ఐపీఎల్ 2021 పూర్తయిన రెండు రోజుల తర్వాత ఐసీసీ టీ20 ప్రపంచకప్ మొదలుకానుంది. మెగా టోర్నీని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే చాలా జట్ల ఆటగాళ్లు ఐపీఎల్ రెండో దశ మ్యాచుల నుంచి తప్పుకున్నారు. కానీ భారత ఆటగాళ్లకు ఆ అవకాశమే లేదని సబా కరీమ్ తెలిపాడు. 'ఒక్కసారి ఆలోచించండి. ప్లే ప్లేఆఫ్స్‌కు ముంబై ఇండియన్స్ చేరుకుందనుకుందాం. మెగా టోర్నీని దృష్టిలో పెట్టుకుని జస్ప్రీత్ బుమ్రాను ముంబై పక్కనపెడుతుందా?. అలా అస్సలు చేయదు. ముంబై మాత్రమే కాదు..ఢిల్లీ, బెంగళూరు ఏ జట్టైనా అలా చేయడానికి ఇష్టపడదు. ఎందుకంటే.. టైటిల్ నెగ్గడమే ఫ్రాంఛైజీల ప్రధాన లక్ష్యం. కాబట్టి టీ20 ప్రపంచకప్ కోసం ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చే పరిస్థితి ఉండదు అని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications












