రోహిత్ శర్మ చెత్త కెప్టెన్సే బంగ్లా చేతిలో టీమిండియా ఓటమికి కారణం: మాజీ క్రికెటర్

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ పర్యటనను టీమిండియా ఓటమితో ప్రారంభించడంపై మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మతో పాటు టీమ్‌మేనేజ్‌మెంట్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా వికెట్ తేడాతో ఓడిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ టెయిలండర్ మెహ్‌దీ హసన్ మిరాజ్.. చివరి వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించాడు.
అయితే ఈ మ్యాచ్‌ను టీమిండియా చేజేతులా చేజార్చుకుందని అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. బ్యాటింగ్‌లో విఫలమైన రోహిత్ శర్మ.. కెప్టెన్‌గా కూడా ఆకట్టుకోలేకపోయాడని మాజీ సెలెక్టర్ సబా కరీం అన్నాడు.

రోహిత్ చెత్త కెప్టెన్సీ
అతని చెత్త కెప్టెన్సీనే టీమిండియా ఓటమికి ప్రధాన కారణమని చెప్పుకొచ్చాడు. ఇండియా న్యూస్ చానెల్‌తో భారత ఓటమిపై స్పందించిన సబా కరీం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ వ్యూహాలు తనను ఆశ్చర్యపరిచాయని చెప్పాడు. 'చివర్లో భారత బౌలర్ల బౌలింగ్ విధానాన్ని విశ్లేషిస్తే.. ఏ ఒక్కరు కూడా సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేయలేదు. రోహిత్ శర్మ కెప్టెన్సీపై కూడా ప్రశ్నలు లేవనెత్తాల్సిన అవసరం ఉంది. అతని సారథ్య తీరుపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. నా దృష్టిలో అతని కెప్టెన్సీ పరమ చెత్తగా ఉంది'అని సబా కరీం ఆగ్రహం వ్యక్తం చేశాడు.

వైట్ బాల్ క్రికెట్‌పై ఫోకస్ పెట్టాలి..
భారత బౌలర్లలో ఏ ఒక్కరిలో కూడా వికెట్ తీయాలనే కసి కనిపించలేదన్నాడు. రోహిత్ బౌలింగ్ మార్పులు, ఫీల్డ్ సెటప్ కూడా బాలేదని విమర్శించాడు. ఫిట్టెస్ట్ బౌలర్లను సిద్దం చేయాల్సిన అవసరం ఉందని, కనీసం ఐదుగురు బౌలర్లను రెడీ చేయాలన్నాడు. ఇది సెలెక్టర్లు చేయాల్సిన పనని, వారు ఐదుగురు బౌలర్లను ఇస్తే ఎన్‌సీఏ సమన్వయం చేస్తుందని చెప్పాడు.
బ్యాటింగ్ వైఫల్యంపై స్పందించిన సబా కరీం.. వైట్ బాల్ క్రికెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని బీసీసీఐకి సూచించాడు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ.. బ్యాటింగ్ ఇబ్బందులను తొలగించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే జట్టు పునర్నిర్మాణంకు శ్రీకారం చుట్టాలని చెప్పాడు.

పేలవ బ్యాటింగ్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ కష్టంగా 9 వికెట్లకు 186 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (70 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 73) టాప్ స్కోరర్‌గా నిలిచి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ అందించాడు. షకీబ్ అల్ హసన్(5/36), ఎబాదత్ హుస్సేన్ (4/47) భారత్ పతనాన్ని శాసించారు.
మెహదీ హసన్ మిరాజ్ (39 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 నాటౌట్), ముస్తాఫిజుర్ (11 బంతుల్లో 2 ఫోర్లతో 10 నాటౌట్) అద్భుతంగా పోరాడడంతో లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 46 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఈ జంట అభేద్యమైన ఆఖరి వికెట్‌కు 51 పరుగులు జోడించింది. లిటన్ దాస్ ( 63 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 41) రాణించాడు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ (3/32), వాషింగ్టన్ సుందర్ (2/17) రాణించారు. మెహదీ హసన్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications