For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిరీస్‌కు ముందు గాయపడే కెప్టెన్‌ అవసరమా? రోహిత్‌ శర్మపై మాజీ సెలక్టర్‌ సెటైర్స్!

Saba Karim says Rohit Sharma as captain in three format is risky over his fitness issues

న్యూఢిల్లీ: సిరీస్ ముందు గాయపడే కెప్టెన్ టీమిండియాకు అవసరమా? అంటూ రోహిత్ శర్మను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్, మాజీ చీఫ్ సెలెక్టర్ సబా కరీం ప్రశ్నించాడు. తరుచూ ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడే రోహిత్ శర్మను టెస్ట్ కెప్టెన్‌గా నియమించడం సరికాదని అభిప్రాయపడ్డాడు. టెస్ట్ సారథ్య బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ అనూహ్యంగా తప్పుకోవడంతో ఆ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడు ఎవరా? అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బీసీసీఐతో పాటు కొందరూ రోహిత్ శర్మనే సరైనవాడని భావిస్తుంటే సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజ ఆటగాళ్లు మాత్రం ఇతర పేర్లను సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ యూట్యూట్‌ చానెల్‌తో మాట్లాడిన సబా కరీం రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మూడు ఫార్మాట్లు ఆడగలడా?

మూడు ఫార్మాట్లు ఆడగలడా?

‘రోహిత్‌ శర్మ తనదైన ఆటతో ఎంతో పేరు సంపాదించుకున్నాడు. జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. అతను జట్టుకు ప్రధాన బలం. అయితే అతని ముందున్న అసలైన సవాల్ ఫిట్‌నెస్. రోహిత్ తరుచూ ఫిట్‌నెస్ సమస్యలతో జట్టుకు దూరం అవుతుంటాడు. కెప్టెన్సీ విషయం పక్కనపెడితే.. అసలు రోహిత్‌కు మూడు ఫార్మాట్లకు అందుబాటులో ఉండటమే అతి పెద్ద టాస్క్‌. ఇప్పటికే ఎన్నోసార్లు గాయపడ్డాడు. ఇప్పుడిప్పుడే రిహాబిలిటేషన్‌ సెంటర్‌ నుంచి తిరిగి వస్తున్నాడు. ఒకవేళ టెస్టు కెప్టెన్‌గా అతడిని నియమించాలని అనుకుంటే ముందుగా... ఫిట్‌నెస్‌ కోచ్‌, ఫిజియోతో చర్చించాలి. టెస్టు సిరీస్‌కు ముందు తరచుగా గాయపడే ఆటగాడిని సారథిని చేయడం ఏమాత్రం సరికాదు.'అని సబా కరీం అభిప్రాయపడ్డాడు.

స్వల కాలమే..

స్వల కాలమే..

ఈ విషయాలు ఏవి పట్టించుకోకుండా రోహిత్‌కు మూడు ఫార్మాట్ల సారథ్యం అప్పగిస్తే అది స్వల్పకాలానికి పరిమితమవుతుందని సబా కరీం తెలిపాడు. ‘2023 టీమిండియాకు అత్యంత ముఖ్యమైనది. వన్డే వరల్డ్‌కప్‌ ఆడాల్సి ఉంది. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ కూడా ఇదే ఏడాది ముగుస్తుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌ ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. రోహిత్‌ శర్మను అన్ని ఫార్మాట్లకు సారథిని చేసినా.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సరైన నాయకుడిని ఎంపిక చేయాలి. ప్రస్తుతానికి రోహిత్‌ శర్మ ఒక్కడే ఆప్షన్‌. ఎందుకంటే.. కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌ వంటి ఆటగాళ్లు ఇంకా పరిణతి చెందాల్సి ఉంది. వాళ్లను నాయకులుగా తీర్చిదిద్దడానికి కాస్త సమయం పడుతుంది'అని సబా కరీం చెప్పుకొచ్చాడు.

గాయంతో సౌతాఫ్రికా పర్యటనకు దూరం..

గాయంతో సౌతాఫ్రికా పర్యటనకు దూరం..

ఇక సౌతాఫ్రికా పర్యటనకు ముందు రోహిత్‌ శర్మను వన్డే కెప్టెన్‌గా, టెస్టు వైస్‌ కెప్టెన్‌గా బీసీసీఐ ప్రమోట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే, టూర్‌ ఆరంభానికి ముందే అతను అనూహ్యంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో టెస్టు సిరీస్‌ ఓటమి తర్వాత కోహ్లీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. రోహిత్‌ గైర్హాజరీలో కేఎల్‌ రాహుల్‌ నేతృత్వం వహించిన వన్డే సిరీస్‌లో టీమిండియా వైట్‌వాష్‌ అయింది.

Team India Test Captain : Doubts On Rohit Sharma's Test Captaincy | Oneindia Telugu
బరువు తగ్గి..

బరువు తగ్గి..

సౌతాఫ్రికా పర్యటనకు దూరమవడంతో నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరిన రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై సీరియస్‌గా దృష్టిసారించాడు. తొడ కండరాల గాయానికి శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు వైద్యుల సూచన మేరకు ఏకంగా 6 కిలోల బరువు తగ్గాడు. బక్కగా ఫిట్‌గా మారిన హిట్ మ్యాన్.. వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లతో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సిరీస్‌ల కోసం పెట్టిన ఫిట్‌నెస్ టెస్ట్‌లో హిట్ మ్యాన్ పాసయ్యాడు. దాంతో సెలెక్టర్లు అతన్ని ఎంపిక చేశారు.

Story first published: Saturday, January 29, 2022, 13:03 [IST]
Other articles published on Jan 29, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+