'ఫ్రాంఛైజీల లక్ష్యం అదొక్కటే..ప్రపంచకప్ కోసం ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వవు!బుమ్రాకు ముంబై విశ్రాంతి ఇస్తుందా?'

ముంబై: యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశ మ్యాచులు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీ దాదాపు నెల రోజుల పాటు క్రికెట్ అభిమానులను అలరించనుంది. ఐపీఎల్ 2021 పూర్తయిన రెండు రోజుల తర్వాత ఐసీసీ టీ20 ప్రపంచకప్ మొదలుకానుంది. మెగా టోర్నీని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే చాలా జట్ల ఆటగాళ్లు ఐపీఎల్ రెండో దశ మ్యాచుల నుంచి తప్పుకున్నారు.
టీమిండియా ప్లేయర్స్ మాత్రం అందరూ ఐపీఎల్ ఆడుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే యూఏఈ చేరుకున్నారు. దీంతో భారత ఆటగాళ్లకు కూడా కొన్ని మ్యాచులలో రెస్ట్ ఇవ్వాలనే డిమాండ్ మొదలైంది. దీనిపై భారత మాజీ వికెట్ కీపర్ సబా కరీమ్ తనదైన శైలిలో స్పందించాడు.

ప్రపంచకప్ కోసం
ఐపీఎల్ 2021 మిగతా మ్యాచులకు తాము అందుబాటులో ఉండమని తాజాగా ఇంగ్లండ్ క్రికెటర్లు డేవిడ్ మలాన్ (పంజాబ్ కింగ్స్), క్రిస్ వోక్స్ (ఢిల్లీ క్యాపిటల్స్), జానీ బెయిర్‌స్టో (సన్‌రైజర్స్) తమతమ ఫ్రాంఛైజీలకు భారీ షాక్ ఇచ్చారు. అంతకుముందే పలువురు ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు కూడా ఐపీఎల్ 2021 నుంచి తప్పుకున్నారు.
ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ జట్లలోని కొందరు ప్లేయర్స్ కూడా టీ20 ప్రపంచకప్ కోసం ఐపీఎల్ టోర్నీని వదులుకున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్ల నిర్ణయం ఎలా ఉండబోతోంది అన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే సబా కరీం కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్న ఫ్రాంఛైజీలు.. ప్రపంచకప్ దృష్ట్యా ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చే అవకాశమే లేదన్నాడు.

బుమ్రాకు ముంబై విశ్రాంతి ఇస్తుందా
తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌తో సబా కరీం మాట్లాడుతూ... 'ఒక్కసారి ఆలోచించండి. ప్లే ప్లేఆఫ్స్‌కు ముంబై ఇండియన్స్ చేరుకుందనుకుందాం. మెగా టోర్నీని దృష్టిలో పెట్టుకుని జస్ప్రీత్ బుమ్రాను ముంబై పక్కనపెడుతుందా?. అలా అస్సలు చేయదు.
ముంబై మాత్రమే కాదు..ఢిల్లీ, బెంగళూరు ఏ జట్టైనా అలా చేయడానికి ఇష్టపడదు. ఎందుకంటే.. టైటిల్ నెగ్గడమే ఫ్రాంఛైజీల ప్రధాన లక్ష్యం. కాబట్టి టీ20 ప్రపంచకప్ కోసం ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చే పరిస్థితి ఉండదు అని పేర్కొన్నాడు.

ఆటగాళ్లకు విశ్రాంతిని ఇవ్వరు
'అగ్రశ్రేణి క్రీడాకారులు ఐపీఎల్ మ్యాచుల కోసం వంద శాతం ఫిట్‌గా ఉండాలని ప్రాంచైజీ యాజమాన్యాలు భావిస్తాయి. అందుకోసం అంతర్జాతీయ మ్యాచులు ఆడుతున్నప్పుడు ఆటగాళ్లు విరామం తీసుకోవాలని వారు కోరుకుంటారు. ఆ సమయంలోనే రెస్ట్ తీసుకుంటే ప్లేయర్స్ ఐపీఎల్ సమయంలో తాజాగా ఉంటారని వారు అభిప్రాయపడతారు.
అంతేకాని టీ20 ప్రపంచకప్ కోసం అని ఐపీఎల్ టోర్నీలో భారత ఆటగాళ్లకు విశ్రాంతిని ఇవ్వరు' అని సబా కరీమ్ తనదైన శైలిలో స్పందించాడు. కాగా టీ20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ ప్రకటించిన భారత జట్టులోని ప్రతిఒక్కరు దాదాపు ఐపీఎల్ 2021 ఆడనున్నారు.

భారత టీ20 ప్రపంచకప్ జట్టు ఇదే
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ.
స్టాండ్ బై ప్లేయర్స్: శ్రేయస్ అయ్యార్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహార్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
IPL 2021: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు చేసింది వీరే.. టాప్-5లో ఇద్దరు భారత బ్యాట్స్‌మన్‌లు!!