For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు చేసింది వీరే.. టాప్-5లో ఇద్దరు భారత బ్యాట్స్‌మన్‌లు!!

Highest individual scores in IPL: Chris Gayle at No 1, KL Rahul and Rishabh Pant in Top 5
IPL 2021 : Top 5 Highest Individual Scores In IPL History || Oneindia Telugu

హైదరాబాద్: కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశకు సమయం ఆసన్నమైంది. యూఏఈ వేదికగా ఈ నెల 19న ఐపీఎల్ 2021 మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అన్ని ఏర్పాట్లు చేసింది. దుబాయ్‌, షార్జా, అబుదాబిలో కఠిన బయో బబుల్ వాతావరణంలో ఐపీఎల్ మ్యాచులు జరగనున్నాయి. సెప్టెంబరు 19న చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య జరిగే పోరుతో ఐపీఎల్ 2021 మిగిలిన మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.

టోర్నీ కోసం ఇప్పటీకే అన్ని జట్లు అక్కడికి చేరుకొని ముమ్మర సాధన చేస్తున్నాయి. అయితే ఐపీఎల్ చరిత్రలో ఇప్పటికి ఎన్నో సెంచరీలు నమోదయ్యాయి. వాటిలో కొన్ని మాత్రమే పెద్ద ఇన్నింగ్స్‌గా మారాయి. ఆ టాప్-5 జాబితా ఓసారి చూద్దాం.

 క్రిస్ గేల్

క్రిస్ గేల్

సునామీ ఇన్నింగ్స్​లకు పెట్టింది పేరు విండీస్ ప్లేయర్ క్రిస్ గేల్. యూనివర్స్ బాస్ క్రీజులోకి వచ్చాడంటే.. బౌండరీల మోత మోగాల్సిందే.. స్కోర్ బోర్డు పరుగులు పెట్టాల్సిందే. ఇక టీ20 అంటే ఈ హిట్టర్ మరింత రెచ్చిపోతాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్​లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 23 ఏప్రిల్ 2013 న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడిన గేల్.. సహారా పుణె వారియర్స్‌పై 66 బంతుల్లో 175 పరుగులు చేశాడు.

టోర్నమెంట్‌లో ఇది అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచింది. గేల్ తన ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 17 సిక్సర్లు బాదాడు. అదే సమయంలో ఐపీఎల్​లో అత్యంత వేగవంతమైన సెంచరీ కూడా నమోదు చేశాడు. 30 బంతుల్లోనే సెంచరీ చేసాడు. అప్పటి నుంచి ఈ రెండు రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేదు.

మెకల్లమ్, డివిలియర్స్

మెకల్లమ్, డివిలియర్స్

ఐపీఎల్​లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన బ్యాట్స్‌మన్‌గా కివీస్ మాజీ ఓపెనర్ బ్రెండన్ మెకల్లమ్ రెండవ స్థానంలో ఉన్నాడు. మెకల్లమ్ 158 పరుగులు చేశాడు. 18 ఏప్రిల్ 2008న ఐపీఎల్ చరిత్రలో మొదటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఈ సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. మెకల్లమ్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ తరపున ఈ ఇన్నింగ్స్ ఆడాడు. మెక్‌కల్లమ్ 73 బంతుల్లో 10 ఫోర్లు, 13 సిక్సర్లు బాదాడు.

మూడవ స్థానంలో ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ ఉన్నాడు. 10 మే 2015 న వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌పై డివిలియర్స్ ఈ ఇన్నింగ్స్ ఆడాడు. ఏబీడీ కేవలం 59 బంతుల్లో 19 ఫోర్లు, 4 సిక్సర్లతో 133 పరుగులు చేశాడు.

NZ Vs IND: భారత్-న్యూజిలాండ్‌ సిరీస్ వాయిదా.. కారణం ఏంటంటే?!

రాహుల్, పంత్

రాహుల్, పంత్

ఐపీఎల్​లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన బ్యాట్స్‌మన్‌గా టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ నాలుగో స్థానంలో ఉన్నాడు. 2020 సీజన్‌లో దుబాయ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై రాహుల్ 132 పరుగుల చేశాడు. కింగ్స్ పంజాబ్ జట్టుకు ఆడిన రాహుల్ కేవలం 69 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్ల సహాయంతో 132 పరుగులు చేశాడు.

ఐదో స్థానంలో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఉన్నాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) తరఫున ఆడిన పంత్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌పై 2018 మే 10న 128 రన్స్ చేశాడు. పంత్ 15 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో టాప్-5లో ఇద్దరు భారత బ్యాట్స్‌మన్‌లు ఉన్నారు. ఇక 2010లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన మురళి విజయ్.. రాజస్థాన్ రాయల్స్ జట్టుపై 127 రన్స్ చేశాడు.

వేగవంతమైన సెంచరీలు

వేగవంతమైన సెంచరీలు

మరోవైపు ఐపీఎల్​లో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన జాబితాలో కూడా క్రిస్ గేల్ మొదటి స్థానంలో ఉన్నాడు. 2013లో పుణె వారియర్స్​తో జరిగిన మ్యాచ్​లో గేల్ కేవలం 30 బంతుల్లోనే సెంచరీ చేసాడు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యూసఫ్ పఠాన్ 2010లో ముంబై ఇండియన్స్ జట్టుపై 37 బంతుల్లోనే సెంచరీ చేశాడు. దక్షిణాఫ్రికాకు చెందిన డేవిడ్ మిల్లర్ 2013లోనే పంజాబ్ కింగ్స్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్)​ తరఫున 38 బంతుల్లో శతకం చేశాడు.

ముంబై ఇండియన్స్‌పై అప్పటి డెక్కన్ ఛార్జర్స్ జట్టుకు ఆస్ట్రేలియాకు మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ 42 బంతుల్లో సెంచరీని సాధించాడు. ఇక ఏబీ డివిలియర్స్, డేవిడ్ వార్నర్ ఇద్దరూ 43 బంతుల్లో సెంచరీలు బాదారు. గుజరాత్ లయన్స్​పై ఏబీ, కోల్​కతా నైటరైడర్స్​పై వార్నర్ 43 బంతుల్లో సెంచరీ బాదాడు.

Story first published: Thursday, September 16, 2021, 14:11 [IST]
Other articles published on Sep 16, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+