
అందుకే సిరాజ్‌కు ఇవ్వలేదు..
అయితే సిరాజ్‌ను కాదని రాహుల్‌కు అవార్డు ఇవ్వడానికి గల కారణాన్ని భారత మాజీ క్రికెటర్ సబా కరీం తెలియజేశాడు. సిరాజ్ ప్రదర్శనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాల్సిందేనని, కానీ రాహుల్ ఆడిన ఇన్నింగ్స్ అంతకంటే ఎక్కువన్నాడు. ప్రతికూల పరిస్థితుల్లో రాహుల్ అద్భుత బ్యాటింగ్ చేసి భారత్‌కు మంచి స్కోర్ అందించాడని తెలిపాడు. 'సిరాజ్ కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రేసులో ఉన్నవాడే. కానీ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ అద్భుతం. ప్రతికూల పరిస్థితుల్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు రాహుల్ మంచి శుభారంభాన్ని అందించాడు. రోహిత్ శర్మతో, ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. రోహిత్ శర్మ క్రీజులో ఉన్నంతవరకు నిదానంగా ఆడిన రాహుల్.. అతను ఔటైన తర్వాత గేర్ మార్చాడు. తనదైన ఆటతో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్‌కు మెరుగైన స్కోర్ అందించాడు.

రాహుల్ పాత్ర కీలకం..
ఇక ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోర్ 350 ధాటితే టీమ్ విజయవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భారత్ మెరుగైన స్కోర్ చేయడంలో రాహుల్‌ది కీలక పాత్ర. ఇతర ఆటగాళ్లంతా తడబడ్డ ఈ వికెట్‌పై కేఎల్ రాహుల్, జోరూట్ ఇద్దరు మాత్రమే సెంచరీలు చేశాడు. ఆ క్రమంలోనే ఈ ఇద్దరిలో విజయం సాధించిన కేఎల్ రాహుల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడం సరైందనేది నా అభిప్రాయం.'అని ఇండియా టీవీతో సబాకరీమ్ అన్నాడు. వాస్తవానికి ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్ ఫస్ట్ చాయిస్ ఓపెనరే కాదు.. అనూహ్యంగా దక్కిన అవకాశాన్ని ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. 250 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్స్‌తో 129 రన్స్ చేసిన రాహుల్.. రోహిత్ శర్మతో కలిసి తొలి వికెట్‌కు 126 పరుగులు... కోహ్లీతో కలిసి 117 పరుగుల కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు. ప్రస్తుతం ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో జోరూట్ (356) తర్వాత రాహులే ఉన్నాడు.

151 పరుగులతో చిత్తు..
ఈ మ్యాచ్‌లో భారత్ 151 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 364 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(129), రోహిత్ శర్మ(83) రాణించారు. ఆ తర్వాత ఇంగ్లండ్.. జోరూట్(180) అజేయ సెంచరీతో 391 పరుగులకు ఆలౌటై 27 పరుగులు ఆధిక్యాన్ని అందుకుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత జట్టును మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా 9వ వికెట్‌కు అజేయంగా 89 పరుగులు జోడించి గట్టెక్కించారు. దాంతో కోహ్లీసేన 298/8 వద్ద డిక్లేర్ చేసింది. ఆ తర్వాత 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ భారత బౌలర్ల ధాటికి 120 పరుగులకే కుప్పకూలి చిత్తయింది. మూడో టెస్ట్ ఆగస్టు 25 నుంచి లీడ్స్ వేదికగా ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications












