గంభీర్‌కు బదులుగా వారిని ఎందుకు బలిపశువులను చేశారు?: మాజీ క్రికెటర్
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై మాజీ చీఫ్ సెలెక్టర్ సబా కరీం మరోసారి విమర్శలు గుప్పించారు. ఇన్ని పరాజయాల తర్వాత కూడా గంభీర్ తన పదవిలో ఎలా కొనసాగుతున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు ఘోర పరాజయాలకు బాధ్యుడైన గంభీర్‌కు బదులుగా సహాయ కోచ్‌లను ఎందుకు బలిపశువులను చేశారని ప్రశ్నించారు.
ఓటములకు కారణమైన వారిని తప్పించుకుండా బీసీసీఐ అనుసరిస్తున్న తీరును సబా కరీం తప్పుబట్టారు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలో భారత్ క్లీన్ స్వీప్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఓటములకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై చర్యలు తీసుకోని బీసీసీఐ.. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే, ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్‌ల కాంట్రాక్ట్‌లను పొడిగించకుండా వారిపై వేటు వేసింది.

ఈ నిర్ణయాన్ని తప్పుబట్టిన సబా కరీం ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 'జట్టు ఓటములకు ప్రధాన కోచ్‌పై చర్యలు తీసుకోకుండా సహాయక సిబ్బందిని బలిపశువులను చేయడం ఎంత వరకు న్యాయం? గెలుపును గర్వంగా భావించే హెడ్ కోచ్, ఓటమి ఎదురైనప్పుడు ఎందుకు బాధ్యత తీసుకోరు..? గంభీర్ తన సహాయక సిబ్బంది చేత సరైన పని చేయించడంలో విఫలమయ్యారు. ముందుగా బీసీసీఐ గంభీర్‌పై చర్యలు తీసుకోవాల్సింది.
ఫుట్‌బాల్‌లో ఒక జట్టు పేలవంగా ఆడితే.. హెడ్ కోచ్‌నే ముందుగా రాజీనామా చేస్తారు? లేదా తప్పిస్తారు. కానీ మన క్రికెట్ వ్యవస్థలో అతన్ని కాపాడటానికి చాలా నాటకాలు జరుగుతాయి. కొన్నిసార్లు కెప్టెన్లను మారుస్తారు. కానీ కోచ్ మాత్రం మారరు. మెగా టోర్నీలు మినహా భారత్ అన్ని సిరీస్‌ల్లో ఓటమిపాలవుతుంది. ఆటగాళ్లలో ఒకరకమైన అభద్రతా భావం ఉంది'అని సబా కరీం అసహనం వ్యక్తం చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

