సౌతాఫ్రికా20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. హ్యాట్రిక్ పరాజయాల అనంతరం విజయాల బాట పట్టిన సన్‌రైజర్స్ అదే జోరును కొనసాగిస్తోంది. ఆదివారం రాత్రి డర్బన్ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మార్కో జాన్సెస్(2/23) సంచలన బౌలింగ్‌తో సన్‌రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 115 పరుగులే చేసింది. కేన్ విలియమ్సన్(45 బంతుల్లో 3 ఫోర్లతో 44) ఒక్కడే రాణించగా.. చివర్లో నవీన్ ఉల్ హక్(15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 30 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.

సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ బౌలర్లలో మార్కో జాన్సెన్, రిచర్డ్ గ్లీసన్, ఓట్‌నీల్ బార్ట్‌మన్, లియమ్ డాసన్ తలో రెండు వికెట్లు తీసారు. అనంతరం లక్ష్యచేదనకు దిగిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 15.2 ఓవర్లలో 4 వికెట్లకు 117 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్(20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31 నాటౌట్), డేవిడ్ బెడింగ్‌హామ్(20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 39) రాణించారు. ఈ గెలుపుతో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ పాయింట్స్ టేబుల్‌లో నాలుగో స్థానంలో నిలిచింది.
డిఫెండింగ్ ఛాంపియన్ అయిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్.. ఈ సీజన్‌లో పేలవ ఆరంభాన్ని అందుకుంది. ఎట్టకేలక విజయాల బాట పట్టడంతో సన్‌రైజర్స్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే జోరును కొనసాగించి ముచ్చటగా మూడో టైటిల్‌ను గెలుచుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
సౌతాఫ్రికా 20 లీగ్‌లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు భాగమైన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు తలపడుతుండగా.. ఈ ఆరు టీమ్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు చెందినవే. సన్‌రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్‌కు సంబంధించిన జట్లు ఉన్నాయి.
ఈ క్రమంలోనే సౌతాఫ్రికా 20 లీగ్‌ను మినీ ఐపీఎల్‌లా పరిగణిస్తారు. ఇక ప్రతీ మ్యాచ్‌కు హాజరయ్యే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్.. ఈ సారి మాత్రం ఇంకా సౌతాఫ్రికా 20 లీగ్‌లో కనిపించలేదు.