సౌతాఫ్రికా20 లీగ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌కు మరో పరాజయం ఎదురైంది. ఓటమితోనే ఈ టోర్నీని ప్రారంభించిన సన్‌రైజర్స్.. పార్ల్ రాయల్స్‌తో శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లోనూ 9 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్(49 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 82) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగినా ఇతర బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. బౌలర్లు కూడా తేలిపోవడంతో సన్‌రైజర్స్‌కు ఓటమి తప్పలేదు.

మార్క్‌రమ్ విధ్వంసం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 175 పరుగులు చేసింది. ఎయిడెన్ మార్క్‌రమ్‌తో పాటు ట్రిస్టన్ స్టబ్స్(28 నాటౌట్) రాణించాడు. పార్ల్ రాయల్స్ బౌలర్లలో క్వెనా మఫకా(2/35), ముజీబ్ ఉర్ రెహ్మాన్(2/27) రెండేసి వికెట్లు తీసారు.
అనంతరం పార్ల్ రాయల్స్ 18.4 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 176 పరుగులు చేసి సునాయ విజయాన్నందుకుంది. పార్ల్ రాయల్స్ లుహన్-డ్రీ ప్రిటోరియస్(51 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 97) తృటిలో శతకం చేజార్చుకోగా.. జోరూట్(44 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 62 నాటౌట్) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. మార్కో జాన్సెన్ ఒక వికెట్ తీసాడు. సన్‌రైజర్స్ తరఫున ఒక్క బౌలర్ కూడా ప్రభావం చూపలేకపోయాడు.
నిరాశలో కావ్య పాప..
వరుస పరాజయాల నేపథ్యంలో సన్‌రైజర్స్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. వరుసగా గత రెండు సీజన్లలో విజేతగా నిలిచిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఈ సారి మాత్రం పేలవ ఆరంభాన్ని అందుకుంది. ఈ ఘోర ఓటమితో కావ్య మారన్ ఎంత బాధపడిందోనని కామెంట్ చేస్తున్నారు. పాపం కావ్య పాప.. తప్పని గోస అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.
సన్‌రైజర్స్‌కు సంబంధించిన ప్రతీ మ్యాచ్‌కు హాజరయ్యే కావ్య మారన్.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌కు మాత్రం లైట్ తీసుకుంది. అతిత్వరలోనే ఆమె సౌతాఫ్రికా గడ్డపై అడుగుపెట్టే అవకాశం ఉందని, ఆమె అక్కడికి వెళ్లిన తర్వాత టీమ్ పూర్వ వైభవం అందుకుంటుందని ఫ్యాన్స్ ఆశాభవం వ్యక్తం చేస్తున్నారు.

దినేశ్ కార్తీక్ అరంగేట్రం..
ఈ మ్యాచ్‌తోనే టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్.. సౌతాఫ్రికా 20 లీగ్‌లో అరంగేట్రం చేశాడు. ఈ టోర్నీలో అతను పార్ల్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆడిన తొలి భారత క్రికెటర్‌గా దినేశ్ కార్తీక్ రికార్డ్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో వికెట్ కీపింగ్ చేసిన కార్తీక్‌కు బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు.
తదుపరి మ్యాచ్‌న్ సన్‌రైజర్స్.. సంక్రాతి పండుగ రోజు ప్రిటోరియా క్యాపిటల్స్‌తో తలపడనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ సాయంత్రం 4.30 గంటలకే ప్రారంభం కానుంది.