Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SA20 League: మన కావ్య పాపకు ప్రపోజ్ చేసిన సఫారీ ఫ్యాన్! పెళ్లి చేసుకుంటావా? అంటూ...(వీడియో)

SA20 League: SRH owner Kaviya Maran gets a marriage proposal from a South African fan goes viral

సెంచూరియన్: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్‌కు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. ఆమె కోసమే క్రికెట్ మ్యాచ్ చూసేవాళ్లు లక్షల్లో ఉన్నారు. బాలీవుడ్ హీరోయిన్‌ను తలపించే ఆమె అందానికి కుర్రాళ్లు పడి చస్తారు. మ్యాచ్‌ సందర్భంగా ఆమె ఇచ్చే క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ చూసి మురిసిపోతారు. ఆమె బాధపడితే తల్లడిల్లుతారు. నవ్వితే.. కావ్వ పాప నవ్విందంటూ సంబరాలు చేసుకుంటారు. కావ్య పాప కోసమైనా.. సన్‌రైజర్స్ గెలవాలని ప్రార్థిస్తుంటారు.

ప్రతీ ఐపీఎల్ సీజన్‌లో ఈ సీన్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి. కావ్య పాపకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తాయి. అయితే ఐపీఎల్‌లోనే కాదు.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ కావ్య మారన్ కోసం పడిచచ్చే అభిమానులు ఉన్నారు.

సౌతాఫ్రికాలో పెళ్లి ప్రపోజ్..

తాజాగా ఓ సౌతాఫ్రికా క్రికెట్ అభిమాని కావ్య మారన్‌ను పెళ్లి చేసుకుంటావా? అని ప్రపోజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. భారత్‌లో ఉన్న ఆమె అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్.. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ పేరిట ఓ జట్టును కొనుగోలు చేసింది. జనవరి 10న మొదలైన ఈ టోర్నీలో ఇప్పటికే సన్‌రైజర్స్ ఈస్టర్న్ ఐదు మ్యాచ్‌లు ఆడేసింది. ఈ జట్టుకు కూడా కావ్య మారనే సీఈవోగా వ్యవహరిస్తుంది. దాంతో జట్టు వ్యవహారాలను చూసుకునేందుకు ఆమె సౌతాఫ్రికాకు వెళ్లింది. అక్కడ సన్‌రైజర్స్ ఆడే ప్రతీ మ్యాచ్‌కు హాజరవుతోంది.

ప్లకార్డు సాయంతో..

ప్లకార్డు సాయంతో..

ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన పార్లే రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌కు కావ్య మారన్ హాజరైంది. స్టాండ్స్‌లో కూర్చొని జట్టును ఉత్సాహపరిచింది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌కు హాజరైన ఓ అభిమాని ప్లకార్డు సాయంతో కావ్య మారన్‌కు ప్రపోజ్ చేయడం చర్చనీయాంశమైంది. 'కావ్యా మారన్.. నన్ను పెళ్లి చేసుకుంటావా?'అంటూ హార్ట్ సింబల్‌తో ఉన్న ప్లకార్డును సదరు అభిమాని ప్రదర్శించాడు. దీనికి సంబంధించిన వీడియోను సౌతాఫ్రికా టీ20 లీగ్ ట్వీట్ చేసింది.

ఎంత ధైర్యం ఉంటే..

ఎంత ధైర్యం ఉంటే..

ఈ వీడియోపై భారత అభిమానులు తమదైన శైలిలో బదులిస్తున్నారు. ఎంత ధైర్యం ఉంటే మా కావ్య పాపకు ప్రపోజ్ చేస్తావ్.. పగిలిపోద్దిరా.. అని హెచ్చరిస్తున్నారు. ఆమె కోసం ఇక్కడ లక్షల్లో ఉన్నామని, ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని సూచిస్తున్నారు. కావ్య మారన్ క్రేజ్ ఈ మాత్రం ఉండాలని మరికొందరు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆమెకు అభిమానులు ఉన్నారని, ఆమె అందం అలాంటిదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

హ్యాట్రిక్ విజయాలు..

హ్యాట్రిక్ విజయాలు..

పార్లే రాయల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో హ్యాట్రిక్ విజయాన్నందుకు సన్‌రైజర్స్ పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన ప్రిటోరియస్ క్యాపిటల్స్ చేతిలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన సన్‌రైజర్స్.. ముంబై ఇండియన్స్‌కు చెందిన ఎంఐ కేప్‌టౌన్‌పై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. పార్లే రాయల్స్ విజయంతో మొత్తం 5 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు నమోదు చేసింది. శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన జోహన్నస్ బర్గ్ సూపర్ కింగ్స్ తదుపరి మ్యాచ్ ఆడనుంది.

Story first published: Friday, January 20, 2023, 11:03 [IST]
Other articles published on Jan 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+