Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SA20 League: శతక్కొట్టిన ఆర్‌సీబీ కెప్టెన్.. తొలి ప్లేయర్‌గా రికార్డు!

 SA20 League: RCB Captain Faf Du Plessis becomes first player to have scored Hundred

జోహన్నెస్‌బర్గ్: సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ దుమ్మురేపుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన జోబర్డ్ సూపర్ కింగ్స్ టీమ్‌కు సారథ్యం వహిస్తున్న ఫాఫ్ డుప్లెసిస్.. లక్నో సూపర్ జెయింట్స్‌కు చెందిన డర్బన్స్ సూపర్ జెయింట్స్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. 86 బంతుల్లో 8ఫోర్లు, 8 సిక్సర్లతో 113 పరుగులు చేసి అజేయంగా నిలిచిన ఫాఫ్ డుప్లెసిస్.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో తొలి సెంచరీ నమోదు చేసిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఫాఫ్ డుప్లెసిస్ అజేయ సెంచరీతో జోబర్గ్ సూపర్ కింగ్స్ 8 వికెట్లతో డర్బన్స్ సూపర్ జెయింట్స్‌ను ఓడించింది.

మెరిసిన క్లాసెన్..

మెరిసిన క్లాసెన్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన డర్బన్స్ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసింది. హెన్రీచ్ క్లాసెన్(48 బంతుల్లో 7 ఫోర్లతో 65) హాఫ్ సెంచరీతో రాణించగా.. జాసన్ హోల్డర్(12 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 28 నాటౌట్) ధాటిగా ఆడాడు. జోబర్గ్ సూపర్ కింగ్స్ బౌలర్లలో మహీశ్ తీక్షణ, గెరాల్డ్ కోయిట్జ్ మూడేసి వికెట్లు తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన జోబర్గ్ సూపర్ కింగ్స్ 19.1 ఓవర్లలో 2 వికెట్లకు 182 పరుగులు చేసి మరో 5 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది.

ఫాఫ్ సెంచరీతో..

ఫాఫ్ సెంచరీతో..

ఫాఫ్ డుప్లెసిస్ సెంచరికి తోడుగా ఓపెనర్ రిజా హెండ్రీక్స్(46 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45) రాణించాడు. సూపర్ జెయింట్స్ బౌలర్లలో రీస్ టోప్లీ, వయాన్ ముల్డర్ తలో వికెట్ తీసారు. ఈ విజయంతో జోబర్గర్ సూపర్ కింగ్స్ పాయింట్స్ టేబుల్‌లో నాలుగో స్థానంలో నిలవగా.. డర్బన్ సూపర్ జెయింట్స్ అట్టడుగున నిలిచింది. ఆ జట్టు 7 మ్యాచ్‌ల్లో రెండు మాత్రమే గెలిచి 5 ఓడింది.

టాప్‌లో ఢిల్లీ..

టాప్‌లో ఢిల్లీ..

ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన ప్రిటోరియా క్యాపిటల్స్ ఏడు మ్యాచ్‌ల్లో విజయాలతో 23 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 4 విజయాలతో 17 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది పార్ల్ రాయల్స్ 4 విజయాలతో మూడో స్థానంలో ఉండగా.. ముంబై ఇండియన్స్‌కు చెందిన ఎంఐ కేప్‌టౌన్ 3 విజయాలతో ఐదో స్థానంలో ఉంది. ఈ లీగ్‌లో ఐపీఎల్ ఫ్రాంచైజీలే 6 జట్లను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

 సంతోషంగా ఆర్‌సీబీ ఫ్యాన్స్..

సంతోషంగా ఆర్‌సీబీ ఫ్యాన్స్..

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఫాఫ్ డుప్లెసిస్ సెంచరీ సాధించడంపై అటు ఆర్‌సీబీ అభిమానులు.. ఇటు చెన్నై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్‌లో ఫాఫ్ డుప్లెసిస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. తమ కెప్టెన్ సూపర్ ఫామ్‌లో ఉండటం తమకు కలిసొచ్చే అంశమని ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ మాత్రం తమ ఫ్రాంచైజీకి చెందిన జట్టు వరుస విజయాలందుకోవడం బాగుందని కామెంట్ చేస్తున్నారు.

Story first published: Wednesday, January 25, 2023, 11:29 [IST]
Other articles published on Jan 25, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+