Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సన్‌రైజర్స్‌ ఓటమి.. కావ్య పాపకు తప్పని గోస!

సౌతాఫ్రికా20 లీగ్‌‌ను డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఘోర పరాజయంతో ప్రారంభించింది. ఎంఐ కేప్ టౌన్‌తో గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 97 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమితో సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ తీవ్ర నిరాశకు గురైంది.

వరుసగా గత రెండు సీజన్లలో విజేతగా నిలిచిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఈ సారి మాత్రం పేలవ ఆరంభాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్‌టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 174 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటర్ డేవాల్డ్ బ్రెవిస్(29 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 57) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. జార్జ్ లిండే(23 నాటౌట్), డెలానో(12 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌‌తో 25 నాటౌట్) మెరుపులు మెరిపించారు.

SA20 Kavya Maran s Sunrisers Eastern Cape thrashed by MI Cape Town in the inaugural game

సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ బౌలర్లలో మార్కో జాన్సెన్, రిచర్డ్ గ్లీసన్ రెండేసి వికెట్లు తీయగా.. బెయర్స్, లియమ్ డాసన్, సిమన్ హార్మర్ తలో వికెట్ తీసారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ అనూహ్యంగా 15 ఓవర్లలో 77 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్(19) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముగ్గురు బ్యాటర్లు డకౌటయ్యారు. డెలానో పోట్గీటర్(5/10) ఐదు వికెట్లతో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ పతనాన్ని శాసించాడు. ట్రెంట్ బౌల్ట్(2/16) రెండు వికెట్లు దక్కాయి.

ఈ ఘోర పరాజయంతో సన్‌రైజర్స్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ ఘోర ఓటమితో కావ్య మారన్ ఎంత బాధపడిందోనని కామెంట్ చేస్తున్నారు. పాపం కావ్య పాప.. తప్పని గోస అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. సన్‌రైజర్స్‌కు సంబంధించిన ప్రతీ మ్యాచ్‌కు హాజరయ్యే కావ్య మారన్.. ఈ ఆరంభ మ్యాచ్‌కు మాత్రం హాజరవ్వలేదు. అతిత్వరలోనే ఆమె సౌతాఫ్రికా గడ్డపై అడుగుపెట్టే అవకాశం ఉందని, ఆమె అక్కడికి వెళ్లిన తర్వాత టీమ్ పూర్వ వైభవం అందుకుంటుందని ఫ్యాన్స్ ఆశాభవం వ్యక్తం చేస్తున్నారు.

ఈ టోర్నీ భాగంగా నేడు డర్బన్ సూపర్ జెయింట్స్, ప్రిటోరియా క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది. సన్‌రైజర్స్ తమ తదుపరి మ్యాచ్‌ను పార్ల రాయల్స్‌తో ఆడనుంది. శనివారం సాయంత్రం 4.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

Story first published: Friday, January 10, 2025, 14:44 [IST]
Other articles published on Jan 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+