Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సన్‌రైజర్స్ ఘన విజయం.. కావ్య పాప ఫుల్ హ్యాపీ! (వీడియో)

SA20 లీగ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ తన జోరును కొనసాగిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. డర్బన్ సూపర్ జెయింట్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సన్‌రైజర్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. వియాన్ మల్డర్(29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీతో రాణించగా.. హెన్రీచ్ క్లాసెన్(17 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 31), మాథ్యూ బ్రీట్జ్కే(24 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 35) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

SA20: Kaviya Maran fans rections after Sunrisers Eastern Cape beat Durbans Super Giants by 5 wickets

సన్‌రైజర్స్ బౌలర్లలో సిమన్ హార్మర్(4/18) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. డానియల్ వోర్రల్, ఒట్నీల్ బార్ట్‌మన్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ ఈస్టెర్న్ క్యాప్ 19.2 ఓవర్లలోనే 5 వికెట్లకు 163 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. ట్రిస్టన్ స్టబ్స్(37 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్(29 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 38), మార్కో జాన్సెన్(14 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 24 నాటౌట్) మెరుపులు మెరిపించారు.

డర్బన్ సూపర్ జెయింట్స్ బౌలర్లలో మార్కస్ స్టోయినీస్(2/27) రెండు వికెట్లు తీయగా.. రీస్ టోప్లీ, కేశవ్ మహరాజ్ తలో వికెట్ తీసారు. సన్‌రైజర్స్ ఈస్టెర్న్ క్యాప్ విజయంపై ఆరెంజ్ ఆర్మీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే జోరును ఐపీఎల్ 2024 సీజన్‌లో చూపించాలని, కావ్య పాప ముఖంలో నవ్వులు చూడాలని ఆకాంక్షిస్తున్నారు.

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ ఈస్టెర్న్ క్యాప్ రెండు విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానంలో కొనసాగుతోంది. జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్‌తో జరగాల్సిన తొలి మ్యాచ్‌ వర్షంతో రద్దవ్వగా.. డర్బన్ సూపర్ జెయింట్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 35 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఇక ముంబై కేప్‌టౌన్‌తో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మూడో మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో గెలుపొందింది. ఉత్కంఠకే ఊపిరి అందని రీతిలో సాగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గెలవడంతో సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ ఎగిరి గంతేసింది. కావ్య పాప రియాక్షన్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తాజా విజయం పట్ల కూడా కావ్య పాప సంతోషం వ్యక్తం చేసింది.

Story first published: Saturday, January 20, 2024, 22:03 [IST]
Other articles published on Jan 20, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+