సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్, సౌతాఫ్రికా బిగ్ హిట్టర్ హెన్రీచ్ క్లాసెన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్ డర్బన్ సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న హెన్రీచ్ క్లాసెన్.. తన ఐపీఎల్ ఫ్రాంచైజీకి చెందిన సన్‌రైజర్స్ ఈస్టెర్న్ కేప్ జట్టుపై విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డాడు.
శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో క్లాసెన్ కాక తన ఊరమాస బ్యాటింగ్‌తో చుక్కలు చూపించాడు. మైదానంలోకి తుఫానులో వచ్చిపోయాడు. 17 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 31 పరుగులతో చిన్నపాటి విధ్వంసం సృష్టించాడు.

ఇందులో ఓ భారీ సిక్సర్ బాదాడు. అతని ధాటికి బంతి స్డేడియం పైకప్పుపై పడింది. దాదాపు 105 మీటర్ల దూరంలో పడిన బంతి ఈ టోర్నీలోనే భారీ సిక్సర్‌గా రికార్డుకెక్కింది. డర్బన్ సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. లియామ్ డాసన్ వేసిన ఈ ఓవర్‌లో అతను వేసిన ఫ్లైటెడ్ డెలివరీని క్లాసెన్ కళ్లు చెదిరే షాట్ ఆడాడు. ప్రస్తుతం ఈ సిక్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
క్లాసెన్ చెలరేగినా ఈ మ్యాచ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్‌కు విజయం దక్కలేదు. తన ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన సన్‌రైజర్స్ జట్టే 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. వియాన్ మల్డర్(29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీతో రాణించగా.. హెన్రీచ్ క్లాసెన్(17 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 31), మాథ్యూ బ్రీట్జ్కే(24 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 35) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
సన్‌రైజర్స్ బౌలర్లలో సిమన్ హార్మర్(4/18) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. డానియల్ వోర్రల్, ఒట్నీల్ బార్ట్‌మన్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ ఈస్టెర్న్ క్యాప్ 19.2 ఓవర్లలోనే 5 వికెట్లకు 163 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. ట్రిస్టన్ స్టబ్స్(37 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్(29 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 38), మార్కో జాన్సెన్(14 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 24 నాటౌట్) మెరుపులు మెరిపించారు.
డర్బన్ సూపర్ జెయింట్స్ బౌలర్లలో మార్కస్ స్టోయినీస్(2/27) రెండు వికెట్లు తీయగా.. రీస్ టోప్లీ, కేశవ్ మహరాజ్ తలో వికెట్ తీసారు.