Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హమ్మయ్యా సన్‌రైజర్స్ గెలిచింది.. మా కావ్య పాప నవ్వింది!

సౌతాఫ్రికా 20 ఫ్రాంచైజీ లీగ్‌లో హ్యాట్రిక్ పరాజయాలతో చతికిలపడిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఎట్టకేలకు విజయం సాధించింది. శుక్రవారం డర్బన్ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 58 పరుగుల తేడాతో గెలుపొందింది. బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో సన్‌రైజర్స్‌ తొలి విజయాన్నందుకుంది.
వరుసగా రెండు సీజన్లలో విజేతగా నిలిచిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఈసారి మాత్రం శుభారంభం అందుకోలేకపోయింది. పేలవ బ్యాటింగ్, చెత్త బౌలింగ్‌తో వరుసగా మూడు పరాజయాలను చవిచూసింది. ఈ ఘోర పరాజయాలను చూసి సన్‌రైజర్స్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

ఇక నాలుగో మ్యాచ్‌లో సమష్టిగా రాణించి ఎట్టకేలకు విజయాన్ని నమోదు చేయడంతో ఫ్యాన్స్ అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 165 పరుగులు చేసింది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్(0) గోల్డెన్ డకౌట్ అయినా.. టామ్ అబెల్(39 బంతుల్లో 5 ఫోర్లతో 57), జాక్ క్రాలీ(29 బంతుల్లో 5 ఫోర్లతో 38), మార్కో జాన్సెన్(26 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 36) రాణించారు.

SA20 Fans Reactions Over Sunrisers Eastern Cape Beat Durban Super Giants After 3 Defeats

డర్బన్ సూపర్ జెయింట్స్ బౌలర్లలో నూర్ అహ్మద్(4/25) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. నవీన్ ఉల్ హక్(1/44) ఒక వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన డర్బన్ సూపర్ జెయింట్స్ 18.1 ఓవర్లలో 107 పరుగులకు కుప్పకూలింది. క్వింటన్ డికాక్(21), వియాన్ మల్డర్(22) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సన్‌రైజర్స్ బౌలర్లలో లియమ్ డాసన్, ఓట్‌నిల్ బార్ట్‌మన్, రిచర్డ్ గ్లీసన్ రెండేసి వికెట్లు తీయగా.. సిమన్ హర్మర్, మార్కో జాన్సెన్ తలో వికెట్ పడగొట్టారు.

సౌతాఫ్రికా 20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఎట్టకేలకు విజయం సాధించడంతో ఫ్యాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 'హమ్మయ్యా సన్‌రైజర్స్ గెలిచింది.. మా కావ్య పాప నవ్వింది'అని కామెంట్ చేస్తున్నారు. సౌతాఫ్రికా 20 లీగ్‌లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు భాగమైన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు తలపడుతుండగా.. ఈ ఆరు టీమ్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు చెందినవే. సన్‌రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్‌కు సంబంధించిన జట్లు ఉన్నాయి.

ఈ క్రమంలోనే సౌతాఫ్రికా 20 లీగ్‌ను మినీ ఐపీఎల్‌లా పరిగణిస్తారు. ఇక ప్రతీ మ్యాచ్‌కు హాజరయ్యే కావ్య మారన్.. ఈ సారి మాత్రం ఇంకా సౌతాఫ్రికా 20 లీగ్‌లో కనిపించలేదు. కావ్య లేకపోవడంతోనే విజయాలు దక్కడం లేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

Story first published: Saturday, January 18, 2025, 13:43 [IST]
Other articles published on Jan 18, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+