For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SA20 లీగ్ విజేతగా సన్‌రైజర్స్ తమ్ముడు.. మూడో టైటిల్ అందుకున్న కావ్య పాప

SA 20 లీగ్ 2026 విజేతగా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ విజేతగా నిలిచింది. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఈ టోర్నీలో మూడో టైటిల్‌ను కైవసం చేసుకుంది. అంతకుముందు 2023, 2024లోనూ ఆ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్(56 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 101) సెంచరీతో రాణించగా.. బ్రైస్ పార్సన్స్(30 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 30) పర్వాలేదనిపించాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో మార్కో జాన్సన్(3/10) మూడు వికెట్లు తీయగా.. లుతో సిపమ్లా, అన్రిచ్ నోర్జ్ చెరో వికెట్ పడగొట్టారు.

SA20 2026 Final Sunrisers Eastern Cape Beat Pretoria Capitals to Clinch Historic Third Title
Photo Credit: Sunrisers Eastern Cape (X)

అనంతరం 19.2 ఓవర్లలో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌ 4 వికెట్లకు 162 పరుగులు చేసి గెలుపొందింది . మాథ్యూ బ్రెట్జ్‌కీ(49 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 నాటౌట్) , ట్రిస్టన్ స్టబ్స్(41 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో సన్‌రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ప్రిటోరియా క్యాపిటల్స్ బౌలర్లలో లుంగి ఎంగిడి, రోస్టన్ ఛేజ్, లిజాడ్ విలియమ్స్ తలో వికెట్ తీసారు.

48 పరుగులకే 4 వికెట్లు..

159 పరుగుల లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. తొలి ఓవర్‌లోనే జానీ బెయిర్ స్టో(0) గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరగ్గా.. క్వింటన్ డికాక్‌ను విలియమ్స్ పెవిలియన్ చేర్చాడు. జోర్డాన్ హన్మన్(3), జేమ్స్ కోల్స్(1) కూడా విఫలమవడంతో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మరోసారి సన్‌రైజర్స్‌కు నిరాశ తప్పదా? అని ఫ్యాన్స్ భావించారు.

ఎగిరి గంతేసిన కావ్య పాప..

ఈ పరిస్థితుల్లో మాథ్యూ బ్రిట్జ్‌కే, కెప్టెన్ ట్రిస్టన్ స్టబ్స్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌ను ఆదుకున్నారు. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో విజయానికి బాటలు వేసారు. బ్రిట్జ్‌కీ 44 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా.. ట్రిస్టన్ స్టబ్స్ 37 బంతుల్లో అర్థ శతకాన్ని అందుకున్నాడు. ఈ ఇద్దరి అద్భుత ప్రదర్శనతో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ విజేతగా నిలిచింది. ఈ విజయంతో సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ ఎగిరి గంతేసింది. ఈ ఫైనల్‌కు హాజరైన ఆమె.. దగ్గరుండి జట్టును గెలిపించింది.

Story first published: Sunday, January 25, 2026, 23:47 [IST]
Other articles published on Jan 25, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+