Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ విజయం..!

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ దుమ్మురేపుతోంది. ఎంఐ కేప్‌ టౌన్‌తో శనివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 4 పరుగుల తేడాతో గెలుపొందింది.

చివరి ఓవర్‌లో ఎంఐ కేప్‌టౌన్ విజయానికి 18 పరుగులు అవసరమవ్వగా.. డానియల్ ఓరల్ తొలి బంతికే వికెట్ తీసి 12 పరుగులే ఇచ్చాడు. దాంతో సన్‌రైజర్స్ విజయం లాంఛనమైంది.

 SA20 2024: Sunrisers Eastern Cape crush MI Cape Town by 4 runs

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 175 పరుగులు చేసింది. టామ్ అబెల్(44 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 60), ఎయిడెన్ మార్క్‌రమ్(32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. ఎంఐ బౌలర్లలో నువాన్ తుషారా రెండేసి వికెట్లు తీయగా.. కగిసో రబడా, కీరన్ పోలార్డ్ తలో వికెట్ తీసాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఎంఐ కేప్‌టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. సామ్ కరణ్(30), కీరన్ పొలార్డ్(30), డెవాల్డ్ బ్రెవిస్(26) పోరాడినా ఫలితం లేకపోయింది. సన్‌రైజర్స్ బౌలర్లలో డానియల్ వోరల్, మార్కో జాన్సెన్, లియామ్ డాసన్ తలో వికెట్ తీయగా.. ఓట్నీల్ బార్టమ్ రెండు వికెట్లు పడగొట్టాడు.

డిఫెండింగ్ ఛాంపియన్ అయిన సన్‌రైజర్స్ ఈస్టెర్న్ కేప్ ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు నమోదు చేసింది. మరో రెండు మ్యాచ్‌ల్లో ఓడగా.. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

Story first published: Saturday, January 27, 2024, 21:50 [IST]
Other articles published on Jan 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+