Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SA20 ఫైనల్లో మెరిసిన కావ్య పాప!

సౌతాఫ్రికా టీ20 లీగ్ ఫైనల్లో సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ మెరిసింది. సొంత జట్టుకు మద్దతు తెలుపుతూ గ్యాలరీలో సందడి చేసింది. ఈ ఫైనల్ మ్యాచ్ కన్నా కావ్య పాపనే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

డర్బస్ సూపర్ జెయింట్స్‌తో శనివారం జరిగిన ఈ ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 204 పరుగుల భారీ స్కోర్ చేసింది. ట్రిస్టన్ స్టబ్స్(30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 56), టామ్ అబెల్(34 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55) హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా.. కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ మామ(26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42), జోర్డాన్ హెర్మెన్(26 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 42) మెరుపులు మెరిపించారు.

Kaviya Maran Spotted

డర్బన్ సూపర్ జెయింట్స్ బౌలర్లలో కేశవ్ మహరాజ్ రెండు వికెట్లు తీయగా.. రీస్ టోప్లీ ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన డర్బన్ సూపర్ జెయింట్స్ 115 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. మార్కో జాన్సెన్(5/30) ఐదు వికెట్లతో డర్బన్ జెయింట్స్ పతనాన్ని శాసించాడు. అతనితో పాటు డానియల్ వోర్రల్, బార్ట్‌మన్ రెండేసి వికెట్లు తీయగా.. సిమన్ హార్మర్ ఓ వికెట్ పడగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు బౌండరీలు బాదిన ప్రతీసారి కావ్య మారన్ ఎగిరి గంతేసింది. చాలా హుషారుగా కనిపించిన ఆమె.. జట్టును తనదైన శైలిలో ఛీర్ చేసింది. బౌలింగ్‌లో వికెట్లు తీసినప్పుడు కూడా కావ్య మారన్ సంతోషానికి హద్దే లేకుండా పోయింది. కావ్య మారన్ ప్రతీ రియాక్షన్‌ను టీవీ కెమెరామెన్ ప్రేక్షకులకు చూపించాడు. ప్రస్తుతం కావ్యమారన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

గతేడాది సౌతాఫ్రికా టీ20 లీగ్ అరంగేట్ర సీజన్‌లోనే ఛాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్.. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఈ ఏడాది కూడా టైటిల్‌ను నిలబెట్టుకుంది. సన్‌రైజర్స్ ఛాంపియన్‌గా నిలవడంపై ఆరెంజ్ ఆర్మీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2024 సీజన్‌లోనూ ఇదే తరహా ప్రదర్శనతో టైటిల్ గెలవాలని ఆకాంక్షిస్తున్నారు.

Story first published: Saturday, February 10, 2024, 23:48 [IST]
Other articles published on Feb 10, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+