Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SA20 2023 ఛాంపియన్ మన సన్‌రైజర్స్.. సంతోషంతో చిందేసిన కావ్య పాప! (వీడియో)

SA20 2023: SRH fans praises Kaviya Maran After Sunrisers Eastern cape won the first edition of SA20

జోహన్నస్‌బర్గ్: సౌతాఫ్రికా 20 లీగ్ ఫస్ట్ సీజన్ టైటిల్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి చెందిన సన్‌రైజర్స్ ఈస్టెర్న్ కేప్ టీమ్ గెలుచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన ప్రిటోరియా క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన సన్‌రైజర్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. అరంగేట్ర టైటిల్‌ను గెలిచి సన్‌రైజర్స్ ఈస్టెర్న్ కేప్ చరిత్ర సృష్టించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్.. 19.3 ఓవర్లలో 135 పరుగులకు కుప్పకూలింది. కుశాల్ మెండీస్(21), రిలీ రోసౌ(19), జేమ్స్ నీషమ్(19) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సన్‌రైజర్స్ బౌలర్లలో వాన్‌డెర్ మెర్వే నాలుగు వికెట్లతో క్యాపిటల్స్ పతనాన్ని శాసించగా.. సిసండా మగల, బార్టమాన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. మార్కో జాన్సెన్, ఎయిడెన్ మార్క్‌రమ్ తలో వికెట్ తీసారు.

చెలరేగిన ఆడమ్ రోసింగ్టన్..

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 16.2 ఓవర్లలోనే 137 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఓపెనర్ ఆడమ్ రోసింగ్టన్(30 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్(26), జోర్డాన్ హెర్మాన్(22) ఫర్వాలేదనిపించారు. మార్కో జాన్సెన్(13 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. క్యాపిటల్స్ బౌలర్లలో అన్రిచ్ నోర్జ్ రెండు వికెట్లు తీయగా.. ఈథన్ బోచ్, ఆదిల్ రషీద్, కొలిని్ ఇంగ్రామ్, జేమ్స్ నీషమ్ తలో వికెట్ తీసారు.

గెలిపించిన మార్క్‌రమ్

లీగ్ ఆరంభంలో వరుస ఓటములను ఎదుర్కొన్న సన్‌రైజర్స్.. ఆ తర్వాత వరుస విజయాలతో ఫైనల్ చేరింది. ముఖ్యంగా ప్రిటోరియా క్యాపిటల్స్‌తో లీగ్ దశలో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ ఓడింది. మొత్తం 10 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 19 పాయింట్లతో సెమీ ఫైనల్ బెర్త్ దక్కించుకున్న సన్‌రైజర్స్.. సెమీఫైనల్‌లో సీఎస్‌కేకు చెందిన జోబర్గ్ సూపర్ కింగ్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ సెంచరీతో చెలరేగి జట్టును ఫైనల్ చేర్చాడు. టోర్నీ‌లో 366 పరుగులు 11 వికెట్లతో సన్‌రైజర్స్ జైత్రయాత్రలో కీలక పాత్ర పోషించిన ఎయిడెన్ మార్క్‌రమ్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ దక్కింది.

కావ్య పాపపై ప్రశంసలు..

వరుస విజయాలతో కావ్య మారన్‌పై విమర్శలు గుప్పించిన అభిమానులు.. సన్‌రైజర్స్ విజయంతో యూటర్న్ తీసుకున్నారు. ఆమెకు క్షమాపణలు చెబుతూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ విజయం పట్ల కావ్య పాప రియాక్షన్ చూడాలని ఉందని కామెంట్ చేస్తున్నారు. అయితే ఇంత పెద్ద ఫైనల్ మ్యాచ్‌కు ఆమె హాజరుకానట్లు తెలుస్తోంది. ప్రతీ మ్యాచ్‌కు వచ్చే కావ్య పాప.. ఇంత కీలకమైన మ్యాచ్‌కు ఎందుకు రాలేదని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. స్టార్ ఆటగాళ్ల కంటే జట్టును గెలిపించే ఆటగాళ్లు కావాలనేదే కావ్య పాప ఫార్ములా అని ఈ విజయంతో అందరికి తెలిసొచ్చిందని కామెంట్ చేస్తున్నారు.

ఇదే జోరులో ఐపీఎల్‌ టైటిల్ కూడా..

ఈ విజయం ఇచ్చిన జోరుతో ఐపీఎల్ 2023 టైటిల్‌ను కూడా సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. ఈ జట్టులో ఉన్న చాలా మంది ఆటగాళ్లు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారని, కోచింగ్ స్టాఫ్ కూడా దాదాపు ఒకటేనని గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్‌కు సన్‌రైజర్స్ కెప్టెన్సీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మంచి రోజులు వచ్చాయని, టైటిల్ గెలుస్తుందని జోస్యం చెబుతున్నారు.

Story first published: Monday, February 13, 2023, 8:47 [IST]
Other articles published on Feb 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+