For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SA vs WI: విండీస్ మహిళల విధ్వంసం.. సూపర్ ఓవర్‌లో 25 పరుగులు! (వీడియో)

 SA vs WI: West Indies Women Smash 25 runs In Super Over against South Africa In 2nd ODI

జోహన్నెస్‌బర్గ్: సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న వెస్టిండీస్ మహిళా క్రికెటర్లు రెచ్చిపోయారు. నాలుగు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆతిథ్య సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో విధ్వంసకర బ్యాటింగ్‌తో అద్భుత విజయాన్నందుకున్నారు. సూపర్ ఓవర్‌కు దారి తీసిన మ్యాచ్‌లో విండీస్ మహిళలు తమ వీరబాదుడుతో ఇంగ్లండ్ అమ్మాయిలకు చుక్కలు చూపించారు. విధ్వంసకర బ్యాటింగ్‌తో సూపర్ ఓవర్‌లో ఏకంగా 25 పరుగులు పిండుకున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 40.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ సున్ లూస్( 52 బంతుల్లో5 ఫోర్లు ఓ సిక్స్‌తో 46) మినహా అంతా విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో అందరూ తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన విండీస్‌ మహిళలు సైతం 37.4 ఓవర్లకు 160 పరుగులకే కుప్పకూలింది. దీంతో మ్యాచ్‌ టైగా మారి సూపర్‌ ఓవర్‌కు వెళ్లింది.

సూపర్ ఓవర్‌లో విండీస్‌ క్రికెటర్లు దియాంద్ర డాటిన్ ( 5 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌లతో 19 నాటౌట్), హేలీ మాథ్యూస్‌ ( 1 బంతి 1 సిక్స్‌తో 6 నాటౌట్) దంచికొట్టారు. వీరిద్దరూ ఆరు బంతుల్లో 25 పరుగులు సాధించి దక్షిణాఫ్రికా బౌలర్‌ షబ్నిమ్‌ ఇస్మేయిల్‌కు చుక్కలు చూపించారు. తొలి బంతికి డాటిన్‌ రెండు పరుగులు తీయగా తర్వాత వరుసగా రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌, మూడు పరుగులు సాధించింది. ఇక చివరి బంతికి హేలీ మరో సిక్సర్‌ బాదడంతో దక్షిణాఫ్రికా ముందు 25 పరుగుల లక్ష్యం నమోదైంది.

కాగా, ఈ సూపర్‌ ఓవర్‌కు ముందు సౌతాఫ్రికా పేసర్‌ షబ్నిమ్‌ మ్యాచ్‌లో చాలా పొదుపుగా బౌలింగ్‌ చేయడం గమనార్హం. కేవలం 3.65 ఎకానమీతో ఆకట్టుకోవడంతో కెప్టెన్‌ సున్‌ లూస్‌ సూపర్‌ ఓవర్‌లో అవకాశమిచ్చింది. కానీ, విండీస్‌ బ్యాటర్లు సూపర్‌ ఓవర్‌లో దంచికొట్టడంతో ఆమె చేతులెత్తేసింది. అనంతరం సౌతాఫ్రికా బ్యాటర్లు క్లో ట్రియాన్‌ (7), తజ్మిన్‌ బ్రిట్స్‌(10) ధాటిగా ఆడినా చివరికి 17 పరుగులు సాధించి మ్యాచ్‌ను కోల్పోయారు. ఈ సూపర్‌ ఓవర్‌‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. వెస్టిండీస్ బ్యాట్స్‌మెనే కాదు మహిళలు కూడా తక్కువేం కాదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Story first published: Tuesday, February 1, 2022, 13:41 [IST]
Other articles published on Feb 1, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+