
హెడ్ టు హెడ్ రికార్డ్స్
ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు 15 సార్లు టీ20ల్లో తలపడ్డాయి. ఇందులో దక్షిణాఫ్రికా 9 మ్యాచుల్లో గెలవగా.. వెస్టిండీస్ 6 మ్యాచులో విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు మూడుసార్లు తలపడగా.. దక్షిణాఫ్రికా 2 విజయాలు అందుకుంది. మరో మ్యాచులో విండీస్ గెలిచింది. ఈరోజు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి.
స్టార్ స్పోర్ట్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్‌లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు. దుబాయ్‌లో జరిగిన గత మ్యాచులో వెస్టిండీస్ 55 పరుగులకే ఆలౌటైంది. అయితే ఇక్కడ భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మొత్తం 300కి పైగా పరుగులు వచ్చాయి. ఇక్కడ 150-160 పరుగులు చేయవచ్చు. సెకండ్ బ్యాటింగ్ చేసే జట్టుకు మంచు కురుస్తున్న కారణంగా ప్రయోజనం ఉండడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేయాల్సిందే.

విండీస్ సమిష్టిగా రాణిస్తేనే
ఇంగ్లండ్‌పై దారుణంగా ఓడిపోయిన వెస్టిండీస్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. విండీస్ సీనియర్ క్రిస్ గేల్ మాత్రమే రెండంకెల స్కోర్ చేరుకున్నాడు. ఇంగ్లండ్‌పై పేలవమైన షాట్లు ఆడిన కరీబియన్ టాప్ ఏడుగురు బ్యాటర్లలో ఆరుగురు ఔట్ అయ్యారు. ఈసారి జట్టు తన విధానాన్ని కచ్చితంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఓపెనర్ ఎవిన్ లూయిస్ తొలి బంతి నుంచే భారీ షాట్లు కొట్టడంలో పేరుగాంచాడు. అతడు మరోసారి చెలరేగాల్సిన అవసరం ఉంది. లెండిల్ సిమన్స్, రోస్టన్ చేజ్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్, కీరన్ పొలార్డ్ బ్యాట్ జులిపించాల్సన అవసరం ఉంది.
ఆండ్రీ రసెల్ టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌కు కీలకం. అతను ఇంగ్లండ్‌పై డకౌట్ అయినా.. భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే అంతర్జాతీయ టీ20లో రసెల్ 716 పరుగులు, 36 వికెట్లు తీశాడు. బౌలర్లు అకేల్ హోసేన్, ఒబెడ్ మెక్‌కాయ్, రవి రాంపాల్ సత్తాచాటితేనే విండీస్ విజయంపై నమ్మకంగా ఉండనుంది.
Mohammed Shami: పాకిస్తాన్ అభిమానికి షమీ వార్నింగ్.. నిజమైన భారతీయుడు అంటూ (వీడియో)!!

డికాక్, మహారాజ్, నోర్జ్ కీలకం
దక్షిణాఫ్రికాకు కూడా ఈ మ్యాచులో విజయం సాధించడం చాలా ముఖ్యం. దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ అనుభవజ్ఞుడైన ఆటగాడు. పవర్ ప్లేలో తన జట్టుకు ఘనమైన ప్రారంభాన్ని అందించగలడు. ఇప్పటి వరకు ఆడిన 58 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో 135.66 స్ట్రైక్ రేట్‌తో 1765 పరుగులు చేశాడు. ఈ మ్యాచులో కూడా డికాక్ చెలరేగాలని మేనేజ్మెంట్ కోరుకుంటోంది. టెంబా బావుమా, రాసీ వాన్ డెర్ డస్సెన్ ఫామ్ ఆందోళన పరుస్తోంది.
కేశవ్ మహారాజ్ పవర్ ప్లేలో ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. పేలవమైన ఫామ్ కనబరుస్తున్నప్పటికీ డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్‌లను తుది జట్టు నుంచి తప్పించే సాహసం ప్రొటీస్ చేయదు. అయితే రీజా హెండ్రిక్స్‌ను టాప్ ఆర్డర్‌లో చేర్చి.. ఐడెన్ మార్క్‌రామ్‌ను దిగువన పంపే అవకాశం ఉంది. అన్రిచ్ నోర్జ్, తబరైజ్ షమ్సీ, కగిసో రబాడాలతో బౌలింగ్ మాత్రం పటిష్టంగా ఉంది.

తుది జట్లు (అంచనా)
దక్షిణాఫ్రికా: టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (కీపర్), రాసీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడా, అన్రిచ్ నోర్జ్, తబరైజ్ షమ్సీ.
వెస్టిండీస్: లెండిల్ సిమన్స్, ఎవిన్ లూయిస్, క్రిస్ గేల్, రోస్టన్ చేజ్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్ (కీపర్), కీరన్ పొలార్డ్ (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, అకేల్ హోసేన్, ఒబెడ్ మెక్‌కాయ్, రవి రాంపాల్.


Click it and Unblock the Notifications












