
షమీపై ట్రోల్స్
టీమిండియా ఓటమిపాలవ్వడంతో పలువురు నెటిజన్లు భారత పేసర్ మహ్మద్ షమీని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. పరుష పదజాలంతో ఆన్‌లైన్‌లో కామెంట్లు చేస్తూ తీవ్రంగా దూషిస్తున్నారు. అయితే ఈ చర్యలను చాలా మంది అభిమానులు, క్రికెటర్లు ఖండిస్తూ షమీకి అండగా నిలుస్తున్నారు. దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్ లాంటి వారు స్పందించారు. అలాగే కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, మజ్లిస్ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సైతం వాటిని ఖండించారు. షమీ అంకితభావమున్న బౌలర్ అని, పలు మ్యాచ్‌ల్లో టీమిండియాను గెలిపించాడని పేర్కొన్నారు.

వెనక్కి వచ్చి మరీ వార్నింగ్
మొహ్మద్ షమీని దూషించేవారికి దీటుగా అతడికి సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓ పాకిస్థాన్ అభిమాని మాటలకు షమీ ఎలా స్పందించాడో ఆ వీడియోలో మనం చూడవచ్చు. అప్పుడు కూడా పాక్ చేతిలో భారత్ ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు డ్రెస్సెంగ్ రూమ్‌కు వెళుతుంటే.. గ్యాలరీలోని ఓ పాక్ అభిమాని జట్టు మొత్తాన్ని ఓ పరుష పదంతో దూషించాడు.
భారత ఆటగాళ్లంతా మౌనంగా వెళ్లిపోయినా.. ఆ మాటలు విన్న షమీ మాత్రం వెనక్కి వచ్చి మరీ స్పందించాడు. సదరు పాక్ అభిమాని వద్దకెళ్లి సీరియస్ వార్నింగ్ ఇవ్వబోయాడు. అంతలోనే అక్కడికి వచ్చిన మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ అతడిని అక్కడినుంచి తీసుకెళ్లాడు.
ఫామ్‌లో ఆజామ్.. రిజ్వాన్, అఫ్రిదితో ప్రమాదమే! న్యూజిలాండ్‌తో బరిలోకి దిగే పాక్ జట్టు ఇదే!
నిజమైన భారతీయుడు
2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మొహ్మద్ షమీ చేసిన పనిపై ప్రస్తుతం కొందరు భారత అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 'నిజమైన భారతీయుడు', 'దేశం పట్ల షమీకి ఉన్న అంకితభావం ఇదే' అంటూ అతడికి మద్దతుగా నిలుస్తున్నారు. మరికొందరు షమీ గతంలో ఆడిన మ్యాచులను గుర్తు చేస్తున్నారు. 2015 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీసిన క్షణాన్ని గుర్తు చేస్తున్నారు. 2019 వరల్డ్ కప్‌లో ఆప్ఘానిస్తాన్పై హ్యాట్రిక్ తీసిన వీడియోను కూడా పోస్టు చేస్తున్నారు. ఇలా కొందరు ఫాన్స్ షమీ మద్దతుగా నిలుస్తున్నారు.

3.5 ఓవర్లు.. 43 పరుగులు
2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 338 పరుగుల చేసి భారత్ ముందు భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే లక్ష్య ఛేదనలో మొహ్మద్ అమిర్ దెబ్బకు విఫలమైన భారత్.. 158 పరుగులకే ఆలౌటైంది. ఇక ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అనంతరం పాక్ మరో 13 బంతులు ఉండగానే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొహ్మద్ షమీ 3.5 ఓవర్లు వేసి 43 పరుగులు సమర్పించుకున్నాడు.


Click it and Unblock the Notifications












