Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SA vs USA: డికాక్ విధ్వంసం.. క్లాసెన్ కాక ఊరమాస్ బ్యాటింగ్!

టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా అమెరికాతో జరుగుతున్న గ్రూప్-2 సూపర్ 8 మ్యాచ్‌లో సౌతాఫ్రికా భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. క్వింటన్ డికాక్(40 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 74) విధ్వంసకర బ్యాటింగ్‌కు హెన్రీచ్ క్లాసెన్(22 బంతుల్లో 3 సిక్స్‌లతో 36 నాటౌట్) ఊరమాస్ బ్యాటింగ్ తోడవ్వడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది.

కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్(32 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 46) క్లాస్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అమెరికా బౌలర్లలో భారత్‌కు చెందిన సౌరభ్ నేత్రవల్కర్(2/21), హర్మీత్ సింగ్(2/24) రెండేసి వికెట్లు తీసారు.

SA vs USA South Africa 194 courtesy of Quinton de Kock and Henrich Klaasen

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు ఆశించిన శుభారంభం దక్కలేదు. ఓపెనర్ రీజా హెండ్రిక్స్(11) దారుణంగా విఫలమయ్యాడు. దాంతో క్రీజులోకి వచ్చిన మార్క్‌రమ్‌తో కలిసి డికాక్ చెలరేగాడు. మార్క్‌రమ్ నెమ్మదిగా ఆడినా.. డికాక్ విధ్వంసకర బ్యాటింగ్‌తో వేగంగా పరుగులు రాబట్టాడు.

ఈ క్రమంలో 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న డికాక్.. మరింత ధాటిగా ఆడుతూ సెంచరీ దిశగా సాగాడు. కానీ అతని జోరుకు హర్మీత్ సింగ్ బ్రేక్ వేసాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 110 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ మరుసటి బంతికే క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్(0) రిటర్న్ క్యాచ్‌ ఇచ్చి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.

ఆ కొద్ది సేపటికే హాఫ్ సెంచరీకి చేరువైన మార్క్‌రమ్‌ను సౌరభ్ నేత్రవల్కర్ పెవిలియన్ చేర్చాడు. వరుస వికెట్లు కోల్పోవడంతో సౌతాఫ్రికా పరుగుల వేగం తగ్గింది. క్రీజులోకి వచ్చిన హెన్రీచ్ క్లాసెన్.. ట్రిస్టన్ స్టబ్స్‌తో కలిసి దూకుడుగా ఆడాడు. 3 భారీ సిక్సర్లతో జట్టు స్కోర్‌ను 190 పరుగుల మార్క్‌ను ధాటించాడు. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న అమెరికా పిచ్‌లపై లోస్కోర్ గేమ్స్ చూసి బోర్‌గా ఫీలైన అభిమానులకు ఈ మ్యాచ్ అసలు సిసలు మజాను అందించింది.

Story first published: Wednesday, June 19, 2024, 21:43 [IST]
Other articles published on Jun 19, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+