Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన పాకిస్థాన్.. భారత్, ఆసీస్‌కు దక్కని రికార్డ్ సొంతం!

పాకిస్థాన్ క్రికెట్ టీమ్ చరిత్ర సృష్టించింది. వన్డే క్రికెట్‌లో సరికొత్త రికార్డ్ నమోదు చేసింది. సౌతాఫ్రికా గడ్డపై మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది. సౌతాఫ్రికాతో ఆదివారం జరిగిన మూడో వన్డేలో పాకిస్థాన్ డక్ వర్త్ లూయిస్ పద్దతిన 36 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది.

తొలి వన్డేలో 3 వికెట్ల తేడాతో గెలిచిన పాకిస్థాన్.. రెండో వన్డేలో 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో సఫారీ గడ్డపై వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన తొలి జట్టుగా సౌతాఫ్రికా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించగా.. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 9 వికెట్లకు 308 పరుగుల భారీ స్కోర్ చేసింది.

SA vs PAK Pakistan Create History AS Become 1st Team To Whitewash South Africa At Home in ODI bilaterals

ఓపెనర్ సయీమ్ ఆయుబ్(94 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 101) సెంచరీతో చెలరేగగా.. బాబర్ ఆజామ్(71 బంతుల్లో 7 ఫోర్లతో 52), మహమ్మద్ రిజ్వాన్(52 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 53) అర్థశతకాలతో రాణించారు.

సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబడా(3/56) మూడు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్(2/58), ఫర్చ్యూన్(2/56) రెండు వికెట్లు పడగొట్టాడు. క్వెనా మఫకా, కోర్బిన్ బోస్చ్ తలో వికెట్ తీసారు. అనంతరం సౌతాఫ్రికా 42 ఓవర్లలో 271 పరుగులకు కుప్పకూలి ఓటమిపాలైంది.

మరోసారి హెన్రీచ్ క్లాసెన్(43 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 81) ఒంటరి పోరాటం చేయగా.. కార్బిన్ బోస్చ్(44 బంతుల్లో 5 ఫోర్లతో 40 నాటౌట్) రాణించాడు. పాకిస్థాన్ బౌలర్లలో సుఫియన్ ముఖీమ్(4/52) నాలుగు వికెట్లు తీయగా.. షాహిన్ షా అఫ్రిది, నసీమ్ షా రెండేసి వికెట్లు పడగొట్టారు. సయీమ్ ఆయుబ్, మహమ్మద్ హస్‌నైన్ తలో వికెట్ తీసారు.

పాకిస్థాన్‌కు ఇది వరుసగా ఐదో వన్డే సిరీస్ విజయం. సొంతగడ్డపై జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు ఈ విజయాలు పాకిస్థాన్ ఆత్మవిశ్వాసాన్ని పెంచనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై నెలకొన్న అనిశ్చితికి ఐసీసీ తెరదించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్‌లో జరుగుతుందని ఐసీసీ ప్రకటించింది. భారత్ మ్యాచ్‌లు తటస్థ వేదికగా జరుగుతాయని పేర్కొంది. మరోవైపు 2027 వరకు భారత్ వేదికగా జరిగే ఐసీసీ టోర్నీల్లో పాకిస్థాన్ మ్యాచ్‌లు తటస్థ వేదికగా జరుగుతాయని స్పష్టం చేసింది.

Story first published: Monday, December 23, 2024, 14:37 [IST]
Other articles published on Dec 23, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+