For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SA vs PAK:చరిత్ర సృష్టించిన పాకిస్థాన్.. 123 ఏళ్ల రికార్డ్ బద్దలు!

టెస్ట్ క్రికెట్‌లో పాకిస్థాన్ జట్టు చరిత్ర సృష్టించింది. 123 ఏళ్లుగా చెక్కుచెదరని ఓ రికార్డ్‌ను అధిగమించింది. సౌతాఫ్రికాతో సోమవారం ముగిసిన రెండో టెస్ట్‌లో పాకిస్థాన్ ఈ ఫీట్ సాధించింది. ఈ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైనా ఈ ఘనతను అందుకుంది. సౌతాఫ్రికా గడ్డపై ఫాలో-ఆన్ ఇన్నింగ్స్ ఆడి అత్యధిక పరుగులు చేసిన తొలి పర్యాటక జట్టుగా చరిత్రకెక్కింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 615 పరుగుల భారీ స్కోర్ చేసింది. ర్యాన్ రికెల్టన్(343 బంతుల్లో 29 ఫోర్లు, 3 సిక్స్‌లతో 259) డబుల్ సెంచరీతో చెలరేగగా.. టెంబా బవుమా(106), కైల్ వెర్రెన్న్(100) శతకాలతో రాణించారు. మార్కో జాన్సెన్(62) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. పాక్ బౌలర్లలో మహమ్మద్ అబ్బాస్, సల్మాన్ అఘా మూడేసి వికెట్లు తీయగా.. మిర్ హంజా, ఖుర్రమ్ షెహ్‌జాద్ రెండేసి వికెట్లు తీసారు.

SA vs PAK Pakistan break 123-year-old record during the second Test against South Africa

అనంతరం పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే ఆలౌటైంది. బాబర్ ఆజామ్(58), మహమ్మద్ రిజ్వాన్(46) మినహా అంతా విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబడా మూడు వికెట్లు తీయగా.. మఫకా, కేశవ్ మహరాజ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. దాంతో పాకిస్థాన్ ఫాలో ఆన్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఫాలో-ఆన్‌లో పాకిస్థాన్ అనూహ్యంగా 478 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ షాన్ మసూద్(251 బంతుల్లో 17 ఫోర్లతో 145) సెంచరీతో రాణించగా.. మరో ఓపెనర్ బాబర్ ఆజామ్(124 బంతుల్లో 10 ఫోర్లతో 81) శతకాన్ని అందుకోలేకపోయాడు. మహమ్మద్ రిజ్వాన్(41), సల్మాన్ అఘా(48) హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నారు.

58 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా 7.1 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. డేవిడ్ బెడింగ్‌హమ్(30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47 నాటౌట్) దూకుడుగా ఆడగా.. ఎయిడెన్ మార్క్‌రమ్(13 బంతుల్లో ఫోర్‌తో 14 నాటౌట్) అతనికి అండగా నిలిచాడు.

ఈ మ్యాచ్ ఓడినా.. సౌతాఫ్రికా గడ్డపై ఫాలో ఆన్ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన పర్యాటక జట్టుగా పాకిస్థాన్ నిలిచింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా పేరిట ఉన్న రికార్డ్‌ను పాక్ అధిగమించింది. 1902లో జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ ఫాలో ఆన్‌లో 372/7 పరుగులు చేసింది. ఇప్పటి వరకు ఇదే రికార్డ్‌గా ఉండగా.. పాకిస్థాన్ 478 పరుగులతో అధిగమించింది. ఈ జాబితాలో పాకిస్థాన్(478/10), ఆస్ట్రేలియా(372/7) తర్వాత వెస్టిండీస్(348/10), న్యూజిలాండ్(342/10), శ్రీలంక) 342/10)లు ఉన్నాయి.

Story first published: Tuesday, January 7, 2025, 7:02 [IST]
Other articles published on Jan 7, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+