Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SA vs NZ: ఇదేందయ్యా ఇది.. ఫీల్డింగ్ కోచ్‌ సబ్‌స్టిట్యూటా?

ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఫీల్డింగ్ కోచ్ వాండిలే గ్వావు ఫీల్డింగ్ చేశాడు. తమ జట్టుకు సరిపోని ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో ఫీల్డింగ్ కోచ్‌ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలోకి బరిలోకి దిగాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అత్యంత అరుదుగా టీమ్ సపోర్ట్ స్టాఫ్స్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్లుగా బరిలోకి దిగుతారు. గతేడాది సౌతాఫ్రికా బ్యాటింగ్ కోచ్ జేమీ డుమినీ కూడా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేశాడు.

ఆటగాళ్లు లేక..
తాజా మ్యాచ్‌లో సౌతాఫ్రికా నలుగురు అరంగేట్ర ఆటగాళ్లతో బరిలోకి దిగింది. ఫస్ట్ ఛాయిస్ ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతోనే కుర్రాళ్లకు అవకాశం ఇచ్చినట్లు సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తెలిపాడు. సౌతాఫ్రికా20 లీగ్ శనివారమే ముగియడంతో ప్రధాన ఆటగాళ్లంతా జట్టుకు అందుబాటులో లేకుండా పోయారు. ఈ సిరీస్‌కు ఎంపికైన ఫస్ట్ ఛాయిస్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వగా.. ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో మరికొంతమందిని ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. ఏకంగా ఆరుగురు అనామక ఆటగాళ్లను ఈ సిరీస్‌కు ఎంపిక చేశారు. ఈ క్రమంలోనే ఫీల్డింగ్ కోచ్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగాల్సి వచ్చింది.

SA vs NZ South African Fielding Coach Takes the Field in Match Against New Zealand in Lahore

న్యూజిలాండ్ ఘన విజయం..
ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 304 పరుగులు చేసింది. అరంగేట్ర ప్లేయర్ మాథ్యూ బ్రీట్జ్‌కే(148 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 150) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. వియాన్ మల్డర్(60 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 64) హాఫ్ సెంచరీతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, విల్ ఓ రూర్కీ రెండేసి వికెట్లు తీయగా.. మైఖేల్ బ్రేస్‌వెల్ తలో వికెట్ పడగొట్టారు.

శతక్కొట్టిన కేన్ మామ..
అనంతరం న్యూజిలాండ్ 48.4 ఓవర్లలో 4 వికెట్లకు 308 పరుగులు చేసి గెలుపొందింది. కేన్ విలియమ్సన్(113 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 133 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. డెవాన్ కాన్వే(107 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 97) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ముతుసామి రెండు వికెట్లు తీయగా.. జూనియర్ డాలా, ఎథన్ బోస్చ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ ముక్కోణపు సిరీస్‌లో న్యూజిలాండ్‌కు ఇది వరుసగా రెండో విజయం. తొలి మ్యాచ్‌లో కివీస్ ఆతిథ్య పాకిస్థాన్‌ను ఓడించిన విషయం తెలిసిందే.

Story first published: Monday, February 10, 2025, 18:11 [IST]
Other articles published on Feb 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+