Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SA vs NZ: న్యూజిలాండ్ ఘోర పరాజయం..!

SA vs NZ: వన్డే ప్రపంచకప్ 2023లో సౌతాఫ్రికా మరో భారీ విజయాన్నందుకుంది. బుధవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌‌ను 190 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసి భారీ లక్ష్యాన్ని నమోదు చేయడం.. తర్వాత నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ప్రత్యర్థి హడలెత్తించడం సౌతాఫ్రికాకు అలవాటుగా మారిపోయింది.

ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన సౌతాఫ్రికా 6 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఈ ఆరింటిలోనూ భారీ విజయాలనే అందుకుంది. ఈ గెలుపుతో పాయింట్స్‌ టేబుల్‌లో భారత్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇరు జట్లు 12 పాయింట్లే సాధించినా.. సౌతాఫ్రికా రన్‌రేట్ మెరుగ్గా ఉంది. ఇక ఘోర పరాజయంతో న్యూజిలాండ్ నాలుగో స్థానానికి పడిపోయి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

 SA vs NZ: South Africa climb top of the table after BIG win vs New Zealand in World Cup 2023

భారీ తేడాతో ఓడిపోవడం న్యూజిలాండ్ రన్‌రేట్‌పై ప్రభావం చూపింది. సెమీస్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. న్యూజిలాండ్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో పాకిస్థాన్, శ్రీలంకతో తలపడనుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 357 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్(116 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 114), రాసీ వాన్ డెర్ డస్సెన్(118 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 133) సెంచరీలతో చెలరేగగా.. డేవిడ్ మిల్లర్(30 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీతో రాణించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ(2/77) రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ నీషమ్‌లకు తలో వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ ఓవర్లలో పరుగులకు కుప్పకూలింది. కేశవ్ మహరాజ్(4/46), మార్కో జాన్సెన్(3/31) న్యూజిలాండ్ పతనాన్ని శాసించగా.. కగిసో రబడా(1/16), గెరాల్డ్ కోయిట్జీ(1/41) తలో వికెట్ తీసారు. న్యూజిలాండ్ బౌలర్లలో గ్లేన్ ఫిలిప్స్(49 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 60 నాటౌట్) ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. విల్ యంగ్(33), డారిల్ మిచెల్(24) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. న్యూజిలాండ్ కనీస పోరాటపటిమ కనబర్చలేకపోయింది.

Story first published: Wednesday, November 1, 2023, 21:19 [IST]
Other articles published on Nov 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+