For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SA vs NZ: ఆ ఇద్దరి వల్లే గెలిచాం: మిచెల్ సాంట్నర్

రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ అసాధారణ బ్యాటింగ్‌తోనే విజయం సాధించామని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ అన్నాడు. పిచ్ బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఈ ఇద్దరూ అద్భుతంగా ఆడారని కొనియాడాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బుధవారం జరిగిన సెమీఫైనల్లో న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసి ఫైనల్ చేరింది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన మిచెల్ సాంట్నర్.. ప్రత్యర్థిపై ఒత్తిడి తెచ్చి ఓడించామని తెలిపాడు.

'ఫైనల్ చేరడం చాలా సంతోషంగా ఉంది. గొప్ప జట్టు సవాల్‌ను అధిగమించాం. ఫైనల్లో భారత్‌ను ఎదుర్కొనేందుకు దుబాయ్ వెళ్తాం. కాస్త విశ్రాంతి తీసుకొని బయల్దేరుతాం. ఇప్పటికే అక్కడ భారత్‌తో ఓ మ్యాచ్ ఆడాం. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బంతి ఆగి వచ్చింది. కానీ రచిన్ రవీంద్ర, విలియమ్సన్ అద్భుతమైన బ్యాటింగ్‌తో అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. మిగతా ఆటగాళ్లు అద్భుతంగా ముగించారు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశాం. ప్రత్యర్థిపై ఒత్తిడి తేవాలనే మా ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేశాం. అనుకున్నట్లుగానే ఒత్తిడిలోకి నెట్టి వికెట్లు తీసాం.

SA vs NZ Mitchell Santner revealed the reason why New Zealand win over South Africa in the Champions Trophy 2025 Semifinal at Lahore
Photo Credit: Twitter

గత మ్యాచ్‌లో మైకేల్ బ్రేస్ వెల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో నేను మూడు వికెట్లు తీయడం సంతోషంగా ఉంది. జట్టులో నలుగురు స్పిన్ ఆల్‌రౌండర్లు ఉండటంతో నా పని ఈజీ అవుతోంది. ఈ మ్యాచ్‌లో రచిన్ ఐదు ఓవర్లు వేయడం గొప్ప విషయం. మ్యాట్ హెన్రీ భుజ గాయంపై వేచి చూస్తాం. ప్రస్తుతం అతనికి కాస్త నొప్పి ఉంది. ఫైనల్‌కు ముందు అతన్ని గాయాన్ని పర్యవేక్షిస్తాం. విలియమ్సన్ నిలకడగా రాణించడం మాకు కలిసొచ్చే అంశం. సౌతాఫ్రికా మాకు సవాల్ విసిరినా మేం 360 పరుగులు చేశాం. భారత్ చేతిలో ఓటమి నేపథ్యంలో 320 పరుగులు సరిపోవనుకున్నాం. ఈ మ్యాచ్‌లో టాస్ గెలవడం కలిసొచ్చింది.'అని సాంట్నర్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 362 పరుగుల భారీ స్కోర్ చేసింది. రచిన్ రవీంద్ర(101 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 108), కేన్ విలియమ్సన్(94 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 102) శతకాలతో రాణించారు. డారిల్ మిచెల్(37 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 49) , గ్లేన్ ఫిలిప్స్ (18 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 49 నాటౌట్) విలువైన పరుగులు చేశారు.

అనంతరం సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 312 పరుగులే చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ టెంబా బవుమా(71 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 56), రాసీ వాన్ డెర్ డస్సెన్(66 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69) హాఫ్ సెంచరీలతో రాణించారు. చివర్లో డేవిడ్ మిల్లర్(67 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 100 నాటౌట్) అజేయ శతకంతో ఒంటరి పోరాటం చేశాడు.

Story first published: Thursday, March 6, 2025, 6:30 [IST]
Other articles published on Mar 6, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+