Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

NZ vs SA: అందుకే తుది జట్టులో మార్పులు చేయలేదు: మిచెల్ సాంట్నర్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ తెలిపాడు. 'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఉపయోగించిన పిచ్ ఇది. మైదానంలో గాలులు వీస్తున్నాయి కాబట్టి డ్యూ వచ్చే అవకాశం లేదు. ఈ కండిషన్స్ ఎలా ఉంటాయో మాకు తెలుసు.

భారత్‌లో మ్యాచ్‌లో విభిన్నమైన కండిషన్స్‌లో ఆడాం. ఈ మ్యాచ్‌కు అన్నివిధాల సిద్దమయ్యాం. మాకు అనుకూలంగా ఉన్న కండిషన్స్‌లో సౌతాఫ్రికాపై ఒత్తిడి తేస్తామని ఆశిస్తున్నా. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాం.'అని మిచెల్ సాంట్నర్ తెలిపాడు.

SA vs NZ Mitchell Santner reveals the reason why New Zealand Playing XI unchanged in CT 2025 Semifinal clash
Photo Credit: Twitter

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లమని సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తెలిపాడు. భారీ లక్ష్యం నమోదు చేసి ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుందని భావించాం. జట్టులో ఒకే ఒక్క మార్పు చేశాం. నేను రీఎంట్రీ ఇచ్చాను. గత నాకౌట్ మ్యాచ్‌ల్లో ఎదురైన పరాజయాల నుంచి మేం గుణపాఠం నేర్చుకున్నాం. విజయం సాధించి ఫైనల్ చేరాలనే లక్ష్యంతో ఉన్నాం. ఎక్కువగా ఆలోచించకున్నా మా ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేయడంపై ఫోకస్ పెట్టాం.'అని టెంబా బవుమా తెలిపాడు.

తుది జట్లు:
సౌతాఫ్రికా: ర్యాన్ రికెల్టన్, టెంబా బావుమా(కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మర్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగీ న్గిడి

న్యూజిలాండ్: విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, కైల్ జామీసన్, విలియం ఒరూర్కే.

Story first published: Wednesday, March 5, 2025, 14:39 [IST]
Other articles published on Mar 5, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+