Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SA vs NZ: శతక్కొట్టిన రచిన్ రవీంద్ర, కేన్ మామ.. సౌతాఫ్రికా ముందు భారీ లక్ష్యం!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ 363 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. రచిన్ రవీంద్ర(101 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 108), కేన్ విలియమ్సన్(94 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 102) శతకాలతో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 362 పరుగుల భారీ స్కోర్ చేసింది.

1
63690

డారిల్ మిచెల్(37 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 49) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. గ్లేన్ ఫిలిప్స్ (18 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 49 నాటౌట్) విలువైన పరుగులు చేశాడు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి(3/72) మూడు వికెట్లు తీయగా.. కగిసో రబడా(2/70) రెండు వికెట్లు పడగొట్టాడు. వియాన్ మల్డర్(1/48) ఓ వికెట్ దక్కింది

SA vs NZ Kane Williamson Rachin Ravindra centuries helps New Zealand Set to 363 Target against South Africa

ఆరంభం అదిరింది..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు విల్ యంగ్, రచిన్ రవీంద్ర శుభారంభం అందించారు. క్రీజులో సెట్ అయిన ఈ జోడీని లుంగి ఎంగిడి విడదీసాడు. విల్ యంగ్‌(21)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. బ్యాటింగ్‌కు వచ్చిన కేన్ విలియమ్సన్‌తో కలిసి రచిన్ రవీంద్ర ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. ఆచితూచి ఆడిన ఈ జోడీ వీలుచిక్కిన బంతులను బౌండరీలకు తరలించింది. స్ట్రైక్ రొటేట్ చేస్తూ.. బౌండరీలు బాదుతూ వేగంగా పరుగులు రాబట్టింది.

శతక్కొట్టిన రచన్.. కేన్
47 బంతుల్లో రచిన్ రవీంద్ర హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. కేన్ విలియమ్సన్ 61 బంతుల్లో అర్థం శతకం సాధించాడు. ఎలాంటి తప్పిదం చేయకుండా జాగ్రత్తగా ఆడి శతకాలు అందుకున్నారు. ముందుగా రచిన్ రవీంద్ర 93 బంతుల్లో శతకం సాధించాడు. ఆ కాసేపటికే అతన్ని రబడా ఔట్ చేసి రెండో వికెట్‌కు నమోదైన 164 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. క్రీజులోకి టామ్ లాథమ్(4) రాగా.. కేన్ మామ 91 బంతుల్లో సెంచరీ సాధించాడు. కానీ ఆ వెంటనే వియాన్ మల్డర్ బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు.

టామ్ లాథమ్‌ను రబడా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఫిలిప్స్‌తో కలిసి డారిల్ మిచెల్ జట్టు స్కోర్‌ను 300 ధాటించాడు. హాఫ్ సెంచరీ ముంగిట అతన్ని ఎంగిడి క్యాచ్ ఔట్ చేశాడు. మైకేల్ బ్రెస్ వెల్(16) సాయంతో గ్లేన్ ఫిలిప్స్ విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టుకు భారీ స్కోర్ అందించాడు.

Story first published: Wednesday, March 5, 2025, 18:28 [IST]
Other articles published on Mar 5, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+