Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SA vs NZ: శతక్కొట్టిన డికాక్, డస్సెన్.. న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే..?

SA vs NZ: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు దుమ్మురేపారు. క్వింటన్ డికాక్(116 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 114), రాసీ వాన్ డెర్ డస్సెన్(118 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 133) సెంచరీలతో సత్తా చాటడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 357 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్(30 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీతో రాణించాడు.

న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ(2/77) రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ నీషమ్ తలో వికెట్ పడగొట్టారు.

SA vs NZ: De Kock, van der Dussen tons, Miller fifty takes South Africa to 357/4 in World Cup 2023

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ టెంబా బవుమా(24) మరోసారి నిరాశపరిచాడు. బౌల్ట్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో పవర్ ప్లేలో సౌతాఫ్రికా వికెట్ నష్టానికి 43 పరుగులే చేసింది. క్రీజులోకి వచ్చిన రాసీ వాన్ డెర్ డస్సెన్‌తో కలిసి క్వింటన్ డికాక్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.

ఆచితూచి ఆడిన ఈ జోడీ క్రీజులో సెట్ అయ్యేందుకు టైమ్ తీసుకుంది. వీలు చిక్కిన బంతిని బౌండరీలకు తరలిచింది. ఈ క్రమంలోనే డికాక్ 62 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నా.. డస్సెన్ 61 బంతుల్లో అర్థశతకాన్ని నమోదు చేశాడు.

హాఫ్ సెంచరీల అనంతరం ఈ జోడీ మరింత సాధికారికంగా బ్యాటింగ్ చేసింది. డికాక్ కాస్త జోరు పెంచి కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఈ క్రమంలో అతను 103 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ టోర్నీలో అతనికిది నాలుగో సెంచరీ కావడం విశేషం. సెంచరీ అనంతరం ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన డికాక్‌ను సౌథీ పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 200 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ సాయంతో వాన్ డెర్ డస్సెన్ 101 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ధాటిగా ఆడిన ఈ ఇద్దరూ జట్టు స్కోర్‌ను 45.3 ఓవర్లలోనే 300 ధాటించారు. డస్సెన్‌ను సౌథీ బౌల్డ్ చేయడంతో మూడో వికెట్‌కు నమోదైన 78 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

క్రీజులోకి వచ్చిన హెన్రీచ్ క్లాసెన్(15 నాటౌట్) ధాటిగా ఆడిన మిల్లర్ 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి ఓవర్‌లో నీషమ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆఖరి బంతి ఆడిన కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ సిక్సర్ బాది ఇన్నింగ్స్‌ను ఘనంగా ముగించాడు.

Story first published: Wednesday, November 1, 2023, 18:21 [IST]
Other articles published on Nov 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+