నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లోనూ సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఓవర్‌కాస్ట్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని సౌతాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ తెలిపాడు. 'మేం మళ్లీ ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. వర్షం వచ్చే అవకాశాలు ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నా.
పిచ్‌పై ఉన్న మాయిశ్చర్‌ను మా బౌలర్లు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నా. తుది జట్టులో ఒక మార్పు చేశాం. కగ్రర్ స్థానంలో హెండ్రీక్స్ తుది జట్టులోకి వచ్చాడు. మేం ఫలితం గురించి పెద్దగా ఆందోళన చెందడం లేదు.'అని ఎయిడెన్ మార్క్‌రమ్ తెలిపాటు.

మరోవైపు టాస్ గెలిచినా బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లమని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. 'మేం ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం. గత మ్యాచ్ తరహాలోనే మా బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌ను కొనసాగించాలనుకున్నాం.
గత మ్యాచ్‌లో విజయం సాధించడం సంతోషంగా ఉంది. ప్రతీ మ్యాచ్ ఓ గుణపాఠం లాంటిదే. మా విజయాల అలవాటును కొనసాగించాలనుకుంటున్నాం. తుది జట్లులో ఎలాంటి మార్పు చేయలేదు. విన్నింగ్ కాంబినేషన్‌నే కొనసాగిస్తున్నాం.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
ఇరు జట్ల మధ్య గత శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో నాలుగు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి తమ ఆధిక్యాన్ని రెట్టింపు చేసుకోవాలని టీమిండియా భావిస్తుంటే.. విజయం సాధించి గత ఓటమికి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో సఫారీ టీమ్ ఉంది.
తుది జట్లు:
భారత్: సంజూ శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తీ, ఆవేశ్ ఖాన్.
సౌతాఫ్రికా: ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రీక్స్, ఎయిడెన్ మార్క్‌రమ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రీచ్ క్లాసెన్(కీపర్), డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, అండిలే సిమిలనే, గెరాల్డ్ కోయిట్జీ, కేశవ్ మహరాజ్, పీటర్.