Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SA vs IND: గుడ్డు పెట్టిన భారత ఓపెనర్లు.. 7 ఏళ్ల తర్వాత తొలిసారి!

SA vs IND: టీమిండియా ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ తీవ్రంగా నిరాశపరిచారు. పేలవ ఆటతీరుతో సౌతాఫ్రికా పర్యటనను ప్రారంభించారు. ఎన్నో అంచనాలతో సఫారీ గడ్డపై అడుగుపెట్టిన భారత ఓపెనర్లు తొలి మ్యాచ్‌లోనే చేతులెత్తేసారు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో ఓపెనర్లు ఇద్దరూ డకౌట్‌గా వెనుదిరిగారు.

ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగగా.. తొలి ఓవర్‌లోనే గట్టి షాక్ తగిలింది. మార్కో జాన్సెన్ వేసిన ఈ ఓవర్‌లో యశస్వీ జైస్వాల్ 3 బాల్ డక్‌గా వెనుదిరగ్గా.. లిజాడ్ విలియమ్స్ వేసిన రెండో ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో టీమిండియా 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.

 SA vs IND: Shubman and Yashasvi out for 0 as India lose both openers for ducks for 1st time in 7 years

7 ఏళ్లలో తొలిసారి..
భారత ఓపెనర్లు ఇద్దరూ ఇలా డకౌటవ్వడం గత ఏడేళ్లలో ఇదే తొలిసారి. 2016లో పాకిస్థాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో అప్పటి టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, అజింక్యా రహానేలు డకౌటయ్యారు. మహమ్మద్ అమీర్ ధాటికి తొలి ఓవర్‌లోనే రోహిత్, రహానే డకౌట్‌గా వెనుదిరిగారు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సూపర్ బ్యాటింగ్‌తో టీమిండియా విజయం సాధించింది.

గుడ్డు పెట్టిన ఓపెనర్లు..
ఓపెనర్లు ఇద్దరూ డకౌటవ్వడంతో నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేల్చుతున్నారు. భారత ఓపెనర్లు ఇద్దరూ సఫారీ గడ్డపై గుడ్లు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుభ్‌మన్ గిల్ కోసం సూపర్ ఫామ్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్‌ను పక్కనపెట్టి టీమిండియా మూల్యం చెల్లించుకుందని కామెంట్ చేస్తున్నారు.

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా విజయం సాధించాలంటే ఓపెనర్లు నిలకడగా రాణించడం చాలా ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు. సఫారీ గడ్డపై ఇంత దారుణంగా భారత ఓపెనర్లు విఫలమవుతారనుకోలేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. సొంతగడ్డపై అచ్చొచ్చిన పిచ్‌పై చెలరేగిన భారత ఓపెనర్లు.. విదేశాల్లో మాత్రం చేతులెత్తేసారని ఎగతాళి చేస్తున్నారు.

ఈ ఇద్దరి వైఫల్యంతో టీమిండియా 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యతో కలిసి తిలక్ వర్మ ధాటిగా ఆడాడు. 20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 29 పరుగులు చేసి వెనుదిరిగాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 49 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్‌తో కలిసి సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్‌ను ముందుకునడిపిస్తున్నాడు.

Story first published: Tuesday, December 12, 2023, 21:34 [IST]
Other articles published on Dec 12, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+