టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సంజూ శాంసన్(50 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లతో 107) టీ20 ఫార్మాట్ తన జోరు కొనసాగిస్తున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో వరుసగా రెండో శతకం సాధించాడు. నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో శుక్రవారం జరిగిన తొలి టీ20లో సంజూ శాంసన్.. 47 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టీ20 క్రికెట్‌లో సంజూ శాంసన్‌కు ఇది రెండో సెంచరీ.
అది కూడా వరుసగా సాధించాడు. గత నెలలో బంగ్లాదేశ్‌తో హైదరాబాద్ వేదికగా జరిగిన మూడో టీ20లో సంజూ శాంసన్ సెంచరీతో చెలరేగాడు. అదే జోరును సౌతాఫ్రికా గడ్డపై చూపించాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ(7) విఫలమైనా.. సూర్యకుమార్ యాదవ్(21), తిలక్ వర్మ(33)లతో కలిసి సెంచరీ సాధించాడు.

మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సంజూ శాంసన్.. భారీ సిక్స్‌లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 10 సిక్స్‌లు, 7 బౌండరీలతో వీర విహారం చేశాడు. 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సంజూ శాంసన్.. మరో 20 బంతుల్లోనే సెంచరీని అందుకోవడం విశేషం. సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి రెండో వికెట్‌కు 66 పరుగులు జోడించిన సంజూ శాంసన్.. తిలక్ వర్మతో కలిసి మూడో వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. సంజూ శాంసన్‌తో పాటు తిలక్ వర్మ(18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33) దూకుడుగా ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయిట్జీ(3/37) మూడు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, పీటర్, క్రుగర్ తలో వికెట్ తీసారు.