SA vs IND: జాతీయ గీతాన్ని అవమానించిన హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్! (వీడియో)
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ అనవసర వివాదంలో చిక్కుకున్నారు. ఈ ఇద్దరూ భారత జాతీయ గీతాన్ని అవమానించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సౌతాఫ్రికాతో నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా డర్బన్ వేదికగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈ ఘటన చోటు చేసుకుంది.
సిరీస్ ప్రారంభానికి ముందు ఇరు జట్లు తమ జాతీయ గీతాలపన చేయడం సంప్రదాయం. ఈ క్రమంలోనే నాలుగు టీ20ల సిరీస్ ప్రారంభానికి ముందు భారత జాతీయ గీతాన్ని ఆటగాళ్లు, అభిమానులు ఆలపించారు. భారత జాతీయ గీతం వచ్చే సమయంలో టెక్నికల్ గ్లిచ్ ఏర్పడింది. దాంతో జాతీయ గీతం కట్ అవుతూ వచ్చింది.

ఇలా కట్ అవుతూ జాతీయ గీతం రావడంతో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ నవ్వుకున్నారు. ఇలా నవ్వడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. జాతీయ గీతాలపన సమయంలో అంతరాయం కలిగితే ఆగ్రహం వ్యక్తం చేయాల్సింది పోయి నవ్వుతారా? అంటూ మండిపడుతున్నారు. ఇతర ఆటగాళ్లంతా చాలా సీరియస్‌గా జాతీయ గీతాలపన చేస్తే.. హార్దిక్, అక్షర్ మాత్రం నవ్వుకున్నారు. ఇది నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) November 8, 2024
Technical issues while playing India national anthem at South Africa #INDvSA pic.twitter.com/zERCrEi3DV
— Mr.Perfect 🗿 (@gotnochills007) November 8, 2024
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. సంజూ శాంసన్‌తో పాటు తిలక్ వర్మ(18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33) దూకుడుగా ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయిట్జీ(3/37) మూడు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, పీటర్, క్రుగర్ తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications